Saturday, March 14, 2026

విక్టరీ వెంకటేష్ లాంచ్ చేసిన విశాల్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘మదగజరాజా’ ట్రైలర్‌, జనవరి 31న సత్య కృష్ణన్ ప్రొడక్షన్స్ ద్వారా తెలుగులో గ్రాండ్‌గా విడుదల

- Advertisement -

విక్టరీ వెంకటేష్ లాంచ్ చేసిన విశాల్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘మదగజరాజా’ ట్రైలర్‌, జనవరి 31న సత్య కృష్ణన్ ప్రొడక్షన్స్ ద్వారా తెలుగులో గ్రాండ్‌గా విడుదల

Trailer of Vishal's Sensational Blockbuster 'Madagajaraja' Launched by Victory Venkatesh, Grand Release in Telugu on January 31 by Satya Krishnan Productions
విశాల్ సెన్సేషనల్ హిట్ ‘మదగజరాజా’ సినిమా సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. సుందర్ సి దర్శకత్వంలో జెమిని ఫిల్మ్ సర్క్యూట్ నిర్మించిన ఈ సినిమా 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, పండుగ సీజన్‌లో తమిళంలో నంబర్ వన్ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ యాక్షన్-కామెడీ సినిమా జనవరి 31న తెలుగులో విడుదల కానుంది. ఈరోజు విక్టరీ వెంకటేష్ ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేశారు.ఈ ట్రైలర్ కామెడీ, యాక్షన్ పర్ఫెక్ట్ బ్లెండ్ తో ఎంటర్ టైనింగ్  రైడ్‌ను  అందించింది. విశాల్, సంతానం మధ్య హిలేరియస్  కెమిస్ట్రీ అదిరిపోయింది. విలన్ సోను సూద్ విశాల్‌తో ఢీకొట్టడం ఒక గ్రిప్పింగ్ షోడౌన్‌గా ఉంటుందని హామీ ఇస్తుంది.విశాల్ తన సిగ్నేచర్ ఎనర్జీతో అదరగొట్టారు. సంతానంతో అతని కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ ఇద్దరూ గ్లామర్‌ను జోడించడం మరింత ఆకర్షణగా నిలిచింది.కామెడీ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో పేరుపొందిన దర్శకుడు సుందర్ సి, మరోసారి తన మార్క్ ఎంటర్ టైనర్ అందించారు. తెలుగు రాష్ట్రాలలో కూడా మద గజ రాజా హిట్ అవుతుందని ట్రైలర్ హామీ ఇస్తోంది.
రిచర్డ్ ఎం. నాథన్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. విజయ్ ఆంటోనీ పవర్ ఫుల్ మ్యూజిక్ ఎనర్జీని మరింత ఎలివేట్ చేసింది. ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచింది.
తారాగణం: విశాల్, సంతానం, వరలక్ష్మి, అంజలి, శరత్ సక్సేనా, సోనూ సూద్, మణివణ్ణన్ (లేట్), నితిన్ సత్య, సడగొప్పన్ రమేష్, ఆర్. సుందర్ రాజన్, మొట్టా రాజేంద్రన్, మనోబాలా (లేట్), స్వామినాథన్, జాన్ కొక్కెన్, టార్జాన్, విచ్చు విశ్వనాథ్,  S మనోహర్, కె. జయలక్ష్మి, అజయ్ రత్నం, సుబ్బరాజు, ముత్తుకలై, అళగు మాస్టర్
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్