- Advertisement -
పురుగులమందు సేవించి వ్యక్తి ఆత్మహత్య
Man commits suicide by consuming pesticide
– తన చావుకు ఆ ముగ్గురే
!
– వైరల్ అవుతున్న సెల్ఫీ వీడియో
డోర్నకల్:
పురుగుల మందు సేవించి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది.మృతుడి సెల్ఫీ వీడియో కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తోడేళ్లగూడెం గ్రామానికి చెందిన పగడాల సతీష్ (30)తన చావుకు అదే గ్రామానికి చెందిన వెంకన్న,పవన్,చరణ్ కారకులని ఆరోపించాడు.!తనను అనేక ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.స్టేషన్లో తన ఫిర్యాదు పట్టించుకోలేదని కారకులు దౌర్జన్యంగా తనపై కేసు నమోదు చేయించారని ఆరోపించాడు. తనకు ఇద్దరు పిల్లలు కుటుంబానికి న్యాయం చేయాలని పురుగుల మందు తాగి చనిపోతున్నట్లు పేర్కొన్నాడు.అట్టి వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతుంది.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



