నూతన డి ఎం ఈ డాక్టర్ నరేంద్ర కుమార్ కు శుభాకాంక్షలవెల్లువ

- Advertisement -

నూతన డి ఎం ఈ డాక్టర్ నరేంద్ర కుమార్ కు శుభాకాంక్షలవెల్లువ

Best wishes to the new DME Dr. Narendra Kumar

హైదరాబాద్
తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్   నూతన డి ఎం ఈ డాక్టర్ నరేంద్ర కుమార్  ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ ఎన్ ఎం ఓ జనరల్ సెక్రెటరీ డాక్టర్ సురేంద్ర బాబు.హైదరాబాద్ లొని కోఠి ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఆయనను కలిసిజ్ఞాపిక అందించి, పలువురుశుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా డీ ఎం ఈ డాక్టర్ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రజలకు సంతృప్తికరమైన వైద్య సేవలను అందించేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ దవాఖానాలను బలోపేతానికి కృషి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తనపై నమ్మకంతో తొలి రెగ్యులర్ డి ఎం ఈ గా నియమించడం పట్ల ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. వైద్య విద్యార్థుల్లోఆత్మస్థైర్యం పెంచడంతో పాటు వైద్య బోధన సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.అనంతరం డాక్టర్ సురేంద్రబాబు మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాల తర్వాత  మొదటిసారిగా డాక్టర్ నరేంద్ర కుమార్ ను రెగ్యులర్ డిఎంఈ గా నియమింపబడడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఇప్పడివరకు ఇన్చార్జి డిఎంఈ లు మాత్రమేఉన్నారన్నారు.తెలంగాణ ఏర్పడినప్పుడు కేవలం 5 ప్రభుత్వ కళాశాలలు, టీచింగ్ హాస్పిటల్స్ఉండేవని…ప్రస్తుతం 34 ప్రభుత్వ కళాశాలు,టీచింగ్ హాస్పిటల్  లు వున్నాయన్నారు.
అంతే కాకుండా రెగ్యులర్ డిఎంఈ లేకపోవడం  వలన  చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నమన్నారు.రెగ్యులర్ డిఎం ఈ రావడంశుభపరిణామం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కి, వైద్య ఆరోగ్యం మంత్రి దామోదర్ రాజనర్సింహ కు తెలంగాణ నేషనల్ మెడికల్ ఆర్గనైజేషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular