- Advertisement -
కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ పురస్కారం అందుకోవడం చాల ఆనందం-ఎంపీడీవో జీవీ సుబ్బరాజు
MPDO GV Subbaraju is very happy to receive the best award at hands of Collector
కౌతాళం
మండల పరిధిలో అధికారులు, సచివాలయం సిబ్బంది కి. గ్రామ సర్పంచ్ లకు,రైతులకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న శుభ సందర్భంగా ఆదివారం గణతంత్ర వేడుకల్లో ఉత్తమ పురస్కారం అవార్డు లభించింది. కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ పురస్కార అందుకోవడం చాలా చాలా ఆనందకర విషయం అని నా సేవలు గుర్తించినందుకు సదా వారికి నేను రుణపడి ఉంటాను అని అతని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఉత్తమ పురస్కారం అవార్డు కలెక్టర్ రంజిత్ బాషా చేతుల మీదుగా ఎంపీడీవో జి వి సుబ్బరాజు అందుకున్నారు. వారు మాట్లాడుతూ గత సంవత్సరాల కొద్దీ గ్రామాల్లో ఉత్తమ సేవలు అందిస్తూ రైతులకు అధికారులు, సచివాలయం సిబ్బంది కి ఎన్నో సలహాలు సూచనలు ఇస్తూ ఉత్తమ పురస్కారం అందుకోవడం చాలా ఆనందకరం విషయమని వారు తెలిపారు. సేవలు చేస్తూ మరెన్నో పురస్కారాలు అందుకోవాలని ఎంపీడీవో కార్యాల సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
- Advertisement -



