ఆనంద్ వర్ధన్, ప్రసన్న కుమార్ దేవరపల్లి, సామ్, ఏఆర్ ఎంటర్ టైన్మెంట్స్ ‘నిదురించు జహాపన’ గ్రిప్పింగ్ టీజర్ రిలీజ్- ఫిబ్రవరి 14న మూవీ గ్రాండ్ రిలీజ్

- Advertisement -

ఆనంద్ వర్ధన్, ప్రసన్న కుమార్ దేవరపల్లి, సామ్, ఏఆర్ ఎంటర్ టైన్మెంట్స్ ‘నిదురించు జహాపన’ గ్రిప్పింగ్ టీజర్ రిలీజ్- ఫిబ్రవరి 14న మూవీ గ్రాండ్ రిలీజ్

Anand Vardhan, Prasanna Kumar Devarapalli, Sam, AR Entertainments 'Nidurinchu Jahapana' Gripping Teaser Release - Movie Grand Release on February 14

ప్రేమించుకుందాం రా, సూర్యవంశం, మనసంతా నువ్వే లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులని అలరించిన పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ ఆనంద్ వర్ధన్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఆనంద్ వర్ధన్ హీరోగా ప్రసన్న కుమార్ దేవరపల్లి దర్శకత్వంలో ఏఆర్ ఎంటర్ టైన్మెంట్స్ పై సామ్ నిర్మిస్తున్న యూనిక్ ఎంటర్ టైనర్ ‘నిదురించు జహాపన’. నవమి గయాక్, రోష్ని సాహోతా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజాగా మేకర్స్ టీజర్ ని రిలీజ్ చేశారు. మనిషి నిద్రపోయే వరకు సైన్స్ అయితే నిద్రపోయాక ఏం జరుగుతుందనేది మాయ’ అనే వాయిస్ ఓవర్ మొదలైన టీజర్ చాలా గ్రిప్పింగా వుంది. కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ అన్నీ చాలా యూనిక్ గా వున్నాయి.ఆనంద్ వర్ధన్ స్క్రీన్ ప్రజెన్స్ చాలా ఎట్రాక్టివ్ గా వుంది. ఆనంద్ వర్ధన్ నవమి గయాక్, రోష్ని సాహోతా మధ్య లవ్ స్టొరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.  డైరెక్టర్ ప్రసన్న కుమార్ దేవరపల్లి మైండ్ బెండింగ్ స్క్రీన్ ప్లే, కాన్సెప్ట్ తో సినిమాని తీర్చిదిద్దారని టీజర్ ప్రామిస్ చేస్తోంది. అనూప్ రూబెన్స్ బీజీఎం ఎమోషన్ ని మరింత ఎలివేట్ చేసింది. టీజర్   సినిమాపై చాలా క్యురియాసిటీ క్రియేట్ చేసిందిరామరాజు, పోసాని కృష్ణ మురళి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఆనంద రెడ్డి నడకట్ల కెమరామెన్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి వెంకట్, నానిబాబు కారుమంచి ఎడిటర్స్.వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
తారాగణం: ఆనంద్ వర్ధన్, నవమి గయాక్, రోష్ని సాహోతా, రామరాజు, పోసాని కృష్ణ మురళి, కల్పలత గార్లపాటి, కంచరపాలెం రాజు, వీరేన్ తంబిదొరై, జబర్దస్త్ శాంతి కుమార్ తదితరులు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular