- Advertisement -
మార్కెటింగ్ శాఖ ఉద్యోగుల నిరసన
Protest of marketing department employeesహైదరాబాద్
సోమవారం నాడు అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి పై దాడిని వ్యతిరేకిస్తూ ఎల్బీనగర్ లోని ప్రాంతీయ సంయుక్త సంచాలకుల కార్యాలయం ముందు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగులతో కలిసి నిరసన తెలియజేసిన టీఎన్జీవోస్ ఏఎంసి ఉద్యోగస్తుల రాష్ట్ర సంఘము అధ్యక్షుడు చిలుక నర్సింహా రెడ్డి కార్యదర్శి ముక్రం ఆధ్వర్యంలో నల్ల బ్యాచులతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా చిలుకా నరసింహారెడ్డి మాట్లాడుతూ..రైతులకు గిట్టుబాటు ధరల రానప్పుడు దాడులు చేయడం వల్ల ధరలు రావన్నారు.గత కొన్ని సంవత్సరాలుగా నిజమైన రైతులు ఇలా ఎపుడు దాడులు చేయలేదన్నారు.మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన రైతుల మద్దతు ధర కోసం అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసి మంత్రి మానిటరింగ్ చేస్తున్నారని అన్నారు.మార్కెట్ కార్యదర్శి పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇటువంటి ఘటనలు పునరావతం కావద్దని అన్నారు…
- Advertisement -




