కూటమి పాలనలో రైతుకి పారిశ్రామికవేత్తలతో సమంగా ప్రాధాన్యం
Farmers are given equal priority with industrialists under the alliance regime
24 గంటల్లో రూ. 33 కోట్ల రవాణా, గోతాముల బకాయిల విడుదల
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు
క్లస్టర్ ఇంచార్జ్ బిజీ వేముల రామచంద్రారెడ్డి
బద్వేలు
కూటమి ప్రభుత్వంలో రైతుకు పారిశ్రామికవేత్తలతో సమంగా ప్రాధాన్యత ఇస్తామని, ప్రతి అడుగులో ఎర్రతివాచీ పరచి రైతుకి ఎక్కడా ఇబ్బంది కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని బద్వేలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు క్లస్టర్ ఇంచార్జ్ బిజీయేముల రామచంద్రారెడ్డి తెలిపారు
విత్తనాల కొనుగోలు నుంచి ధాన్యం అమ్ముకునే వరకు సింగిల్ విండో తరహా విధానాలు అమలు చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా వ్యవసాయ రంగ పటిష్టతకు ప్రత్యేక పథకాలు అమలు చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో సొమ్ము రైతు అకౌంట్ లో వేసే ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏడు నెలల ప్రణాళికలో భాగంగా పౌరసరఫరాల శాఖ బకాయిల్లో రూ. 10 వేల కోట్లు తిరిగి చెల్లించడంతో పాటు 10 వేల కొత్త రేషన్ షాపులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఫెయిర్ ప్రైస్ షాపులు తీసుకువచ్చి బియ్యం, కందిపప్పుతోపాటు చక్కెర, పామ్ ఆయిల్ ఇతర నిత్యావసరాలు అందచేసే ఏర్పాటు చేస్తున్నామన్నారు. త్వరలో బియ్యం నాణ్యత పెంచే విధంగా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రతి పని ప్రజల పక్షాన నిలబడే విధంగా ముందుకు వెళ్తోందన్నారు. “ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో చెప్పిన మాటలు అధికారంలోకి వచ్చిన తర్వాత తు.చ. తప్పకుండా ముందుకు తీసుకువెళ్తున్నాం. ప్రజల పక్షాన నిలబడి నిస్వార్ధంగా సేవలు అందిస్తున్నాం. . గ్రామాల్లో 80 శాతం మంది కౌలు రైతులు ఉంటే, గత ప్రభుత్వ హాయంలో ఐదేళ్లలో వారి గురించి పట్టించుకున్న నాథుడు లేకపోయాడు. కౌలు రైతుల కృషిని ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. వారు ఆత్మహత్యలకు పాల్పడినప్పుడు ఒక్కొక్కరు రూ. 17 లక్షల వరకు అప్పులు చేస్తే, లక్షా, లక్షా 20 వేలుగా చిత్రించారు. కౌలు రైతు గుర్తింపు నిబంధనలు మార్చేసి సీసీఆర్సీ కార్డులు కూడా ఇవ్వకుండా చేసింది.



