కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ నిర్మించాలి

- Advertisement -

కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ నిర్మించాలి

A steel industry should be built in Kadapa district under SAIL

జిల్లా సమగ్ర అభివృద్ధికై జరుగుతున్న జీపు జాతను జయప్రదం చేయండి

జీపు జాత కరపత్రాలను విడుదల చేసిన సిపిఎం నాయకులు
బద్వేలు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో  మంగళవారం జిల్లా సమగ్ర అభివృద్ధికై జనవరి 30,31 తేదీలలో నిర్వహిస్తున్న జీపు జాత కరపత్రాలను స్థానిక సుందరయ్య భవనం నందు విడుదల చేయడం జరిగింది.*

ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి కె.శీను మాట్లాడుతూ…. సిపిఎం 27వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఈనెల 30 తేదీ కడప ఉక్కు- ఆంధ్రుల హక్కు నినాదంతో రాష్ట్ర జీపు జాత జమ్మలమడుగు నుంచి ప్రారంభమవుతుందని ఈ జీపు జాతను సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కర్నూలు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ ప్రారంభిస్తున్నారని,
రాష్ట్ర విభజనలో భాగంగా  సేయిల్ ఆధ్వర్యంలో  ఉక్కు పరిశ్రమ నిర్మిస్తామని విభజన చట్టంలో పొందుపరిచినప్పటికీ కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణ పనులు పాలకులు మారినప్పుడల్లా శిలాఫలకాలు వేస్తున్నారే తప్ప నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదని, వెనుకబడిన ప్రాంతాలలోనే భారీ పరిశ్రమలను నిర్మించి నిరుద్యోగ యువతీ- యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాల సామాజిక బాధ్యత అని భారత రాజ్యాంగం ఆదేశించిన, దేశంలోనే అత్యంత కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమ నడిబొడ్డు కడప జిల్లాలో భారీ ఉక్కు పరిశ్రమ నిర్మించడానికి వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయని, ఇరుపకణిజా నిక్షేపాలు, సున్నపురాయి, నిక్కెల్, డోలమైట్ వంటి ఎన్నో ఖనిజాలు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని, కూత వేటు దూరంలోనే ఆర్టీపిపి భారీ విద్యుత్ ధర్మల్ కేంద్రం, గండికోట, మైలవరం జలాశయాలు, హైవే రోడ్లు, రైల్వే లైన్లు, నెల్లూరు కృష్ణపట్నం ఓడరేవులు అన్ని అందుబాటులో ఉన్నా కానీ ఉద్దేశపూర్వకంగానే ఎన్డీఏ భాగస్వాములైన నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు శిలాఫలకం వేసి  మొండి చేయి చూపించినది 2019 అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండుసార్లు శంకుస్థాపన చేసి నిర్మించకుండా ప్రజలను మోసం చేశారన్నారు రాయలసీమ ప్రాంతంలో ఉపాధి పరిశ్రమలు చాలా అవసరం అని అందుకోసం సాగే జిల్లా జీపు జాత కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని రానున్న కాలంలో సిపిఎం పార్టీ నిర్వహించే పోరాటాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కార్యక్రమం లో పట్టణ కమిటీ సభ్యులు చిన్ని, షరీఫ్ ,సుబ్బరాయుడు, కైరుణ్ బీ, అనంతమ్మ, శాఖ కార్యదర్శులు మురప్రసాద్, కొండయ్య,అంజి, వెంకటసుబ్బయ్య, కేశవ ,గురుదేవి .రత్తమ్మ రత్తమ్మ కేశవ వెంకటపతి వెంకటేశ్వర్లు శ్రీనివాసులు నాగమ్మ ఓబులేసు రాజగోపాల్ పాల్గొన్నారు .

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular