జి.ఎస్.ఎల్.వి ఎఫ్15 ప్రయోగం విజయవంతం

- Advertisement -

జి.ఎస్.ఎల్.వి ఎఫ్15 ప్రయోగం విజయవంతం

GSLV F15 launch successful

శ్రీహరికోట
ఇస్రో చరిత్ర సృష్టించింది. షార్ ప్రయోగించిన వందో ప్రయోగం విజయవంతమైంది. ఉ.6.23 గంటలకు నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన జి ఎస్ ఎల్ వి ఎఫ్15 రాకెట్ ఎన్ వి ఎస్-02 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీంతో షార్ సైంటిస్టులు హర్షం వ్యక్తం చేశారు. 2,250 కేజీల బరువున్న ఈ శాటిలైట్ను యూఆర్ శాటిలైట్ సెంటర్ డిజైన్ చేసింది. ఇది పదేళ్లపాటు భౌగోళిక, వైమానిక, సముద్ర నేవిగేషన్ సేవలు అందించనుంది.
వంద వ’ ప్రయోగం మైలురాయిగా నిలుస్తుంది
: ఇస్రో ఛైర్మన్. డా.వి.నారాయణన్
షార్ నుంచి చేపట్టిన వందో ప్రయోగం మైలురాయిగా నిలుస్తుందని ఇస్రో ఛైర్మన్ డా.వి.నారాయణన్ అన్నారు. ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం సక్సెస్ కావడం సంతోషంగా ఉందన్నారు. దీనికోసం పనిచేసిన సైంటిస్టులు, సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. విక్రమ్ సారాబాయ్ నుంచి ఇస్రో విజయ పరంపర కొనసాగుతోందని చెప్పారు.ఇప్పటివరకు 6 జనరేషన్ల లాంచ్ వెహికల్స్ అభివృద్ధి చేసినట్లు ఆయన వివరించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular