- Advertisement -
పిల్లుట్ల జీవి జీకే ఆర్వో హైస్కూల్ ను సందర్శించిన ఎమ్మెల్యే యరపతినేని
MLA Yarapatineni visited Pillutla Jivi GK ARO High Schoolమాచవరం,
పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, మాచవరం మండలం, పిల్లుట్ల గ్రామం నందు గుర్రం వీర గోపాల కృష్ణారెడ్డి (జీవి జీకే ఆర్ఓ) ఉన్నత పాఠశాలను గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆకస్మికంగా సందర్శించారు. ఆ పాఠశాల నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యే శ్రీనివాసరావు పరిశీలించి స్వయంగా విద్యార్థులకు ఆహారాన్ని వడ్డించారు. పాఠశాల నిర్వహణ పట్ల ఎమ్మెల్యే యరపతినేని సంతోషం వ్యక్తం చేశారు. అదే సందర్భంలో విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యరపతినేని తో పాటు పార్టీ సీనియర్ నాయకులు నంద్యాల ధనంజయ రెడ్డి, ఎంఈఓ శ్రీనివాసరెడ్డి, పిల్లుట్ల గ్రామ సర్పంచ్ శ్రీనివాసరావు, తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీలో చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -




