Wednesday, February 25, 2026

వన్ టైమ్  టోల్ పాస్…

- Advertisement -

వన్ టైమ్  టోల్ పాస్…

One Time Toll Pass...

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6 (వాయిస్ టుడే)
జాతీయ రహదారులపై ప్రయాణించే మధ్యతరగతి, ప్రైవేట్ కార్ల యజమానులకు టోల్ ఛార్జీల వసూల నుంచి కొంత ఉపశమనం కల్పించేందుకు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ సరికొత్త ఆలోచన చేస్తోంది. ఇప్పటి వరకు ఎప్పుడు టోల్ రోడ్డు ఎక్కితే.. అప్పుడు టోల్ ఛార్జ్ వసులూ చేస్తున్నారు. ప్రయాణించే దూరం, వాహనం రకాన్ని బట్టి ఈ టోల్ ఉంటుంది. అయితే.. కొత్త విధానంలో వార్షిక టోల్ పాస్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఇది.. మధ్యతరగతి వర్గాలకు, ప్రైవేట్ కార్ల యజమానుల లబ్ధి చేకూర్చనుంది.
కేంద్ర రోడ్డు రవాణా శాఖ ప్రతిపాదిస్తున్న  “వార్షిక టోల్ పాస్” ఆఫర్‌ ను తీసుకోవాలంటే.. కారు యజమానులు రూ. 3,000 చెల్లించాల్సి ఉంటుంది. పాస్ తీసుకున్నప్పటి నుంచి ఆ కారులో 12 నెలల పాటు దేశంలోని టోల్ రోడ్లపై అపరిమిత ప్రయాణం చేసే అవకాశం పొందుతారు. అదే తీరుగా.. “జీవితకాల పాస్” ఆప్షన్‌ను కూడా ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ విధానంలో.. వాహన యజమానులు ముందుగానే రూ. 30 వేలు ముందస్తు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్ లో పాసు తీసుకున్న వారికి లైఫ్ టైమ్ అంటే.. 15 సంవత్సరాల పాటు టోల్ పాస్ పొందవచ్చు. జాతీయ రహదారుల ద్వారా ప్రయాణించే ప్రైవేట్ కార్ల యజమానులకు నెలవారీ పాస్‌లు అందిస్తున్నారు. వాళ్లు తీసుకున్న ఫాస్ట్ ట్యాగ్ లోనే ఈ సౌకర్యం కల్పించగా.. ఇందుకోసం నెలకు రూ. 340 చెల్లించాల్సి ఉంటుంది. అంటే సంవత్సరానికి ఒక్కో కారు యజమాని రూ. 4,080 చెల్లిస్తున్నట్లు. అలాంటి వాళ్లంతా..  ఈ కొత్త ఆఫర్ ద్వారా రూ. 3,000 తోనే, 12 నెలల పాటు టోల్ రోడ్లపై అపరిమిత ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తారని సమాచారం. అంటే.. ఏడాదికి రూ.1,080 ఆదా చేసుకోవచ్చు. ఈ కొత్త ఆఫర్ ను సైతం ఫాస్ట్‌ట్యాగ్ సిస్టమ్‌లోనే అమలు చేయనున్నారు.  ఇప్పుడు వాడుతున్న ఫాస్ట్ ట్యాగ్ లోనే సరికొత్తగా ఏడాది, లైఫ్ టైమ్ ఆఫర్లను జోడించనున్నారు. ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా ఆ వివరాలు ఆటోమేటిక్‌గా గుర్తించనున్నారు. ఇది నిత్యం టోల్ రోడ్లపై తిరిగే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని కేంద్రం భావిస్తోంది.దేశంలో టోల్ రోడ్లు, వసూలు చేస్తున్న టోల్ రుసుములపై కొంత అసంతృప్తి ఉన్న విషయం అందరికీ తెలుసు. అందుకే.. కేంద్రం సైతం క్రమంగా టోల్ వసూళులో కొత్త విధానాలు, ఆఫర్లు ప్రకటిస్తోంది. ప్రస్తుత ఆలోచన కార్యరూపం దాల్చితే.. హైవే వినియోగదారులకు టోల్ ఛార్జుల నుంచి మరింత ఉపశమనం కలుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయంపై ఇటీవల ప్రకటన ఇచ్చారు, ప్రైవేట్ కార్ల యజమానులకు వీలుగా, సౌకర్యం కలిగించే ఆఫర్లను తీసుకువస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గత సంవత్సరం 2023-24లో దేశంలో రూ. 55,000 కోట్ల టోల్ ఆదాయం వసూలైంది. ఈ ఆదాయంలో ప్రైవేట్ కార్ల భాగస్వామ్యం కేవలం 8,000 కోట్ల వరకు మాత్రమే ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు. అయితే, టోల్ లావాదేవీలు, వసూళ్ల ధోరణి పరిశీలిస్తే.. 53% లావాదేవీలు ప్రైవేట్ కార్లవే అని తెలుస్తోంది. కానీ టోల్ వసూళ్లలో వాటా కేవలం 21% మాత్రమేగానే ఉంటోంది. అందుకే.. సరికొత్త విధానంలో వీరికి కొంత మేర లబ్ధి చేకూర్చాలని కేంద్రం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.అంతేకాకుండా, టోల్ ప్లాజాలలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య దాదాపు 60 శాతం ట్రాఫిక్ ప్రైవేట్ వాహనాలదే. అయినప్పటికీ, వాణిజ్య వాహనాల రాకపోకలు పగలు, రాత్రి అంతా దాదాపు సమానంగా ఉంటుంది. ఈయర్లీ పాస్ ఆఫర్ అమలు చేస్తే మొదట్లో నేషనల్ హైవే అథారిటీ కొంత ఆదాయాన్ని కోల్పోవచ్చని అంటున్నారు. అయినప్పటికీ, కొన్ని సంవత్సరాలలో ఈ పాస్‌లకు గిరాకీ పెరుగుతుందని, వాహనదారులు ఈ పాస్ లను తీసుకుంటారని అంటున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ కార్ల యజమానులు.. ఈ కొత్త సౌకర్యాన్ని ఉపయోగించుకొని జాతీయ రహదారులపై మరింత దూరం, మరిన్ని ఎక్కువ సార్లు ప్రయాణాలు చేస్తారని అంచనా వేస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్