Wednesday, February 25, 2026

2025లోనేనా జనాభా లెక్కలు

- Advertisement -

2025లోనేనా జనాభా లెక్కలు

Census of India in 2025

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7, (వాయిస్ టుడే)
దేశంలో జనగణన ఈ ఏడాది కూడా నిర్వహించకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ లో జనాభా లెక్కల నిర్వహణకు సంబంధించి అరకొర కేటాయింపులే చేయడంతో ఈ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ బడ్జెట్‌లో జనగణన కోసం పరిమిత కేటాయింపులు ఉండటమే ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జనగణన, జాతీయ జనాభా పట్టిక -ఎన్‌పీఆర్‌ ప్రక్రియ కోసం కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.574.80 కోట్లు మాత్రమే కేటాయించింది.నిజానికి 2021లోనే జనగణన నిర్వహించాల్సి ఉంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత క్రమం తప్పకుండా ప్రతీ 10 ఏళ్లకు ఒకసారి దేశంలో జనాభా లెక్కలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే 2021-2022 బడ్జెట్‌లోనే జనగణన కోసం కేంద్ర ప్రభుత్వం రూ.3,768 కోట్లను ప్రతిపాదించింది. అయితే అప్పుడు దేశంలో కరోనా మహమ్మారి భయాలు ఉండటంతో జనాభా లెక్కలు నిర్వహించడం వీలు కాలేదు. ఆ తర్వాత 2023-24 బడ్జెట్‌లో జనాభా లెక్కల కోసం కేవలం రూ.578.29 కోట్లు మాత్రమే నరేంద్ర మోదీ సర్కార్ కేటాయించింది. అయినా దేశంలో లోక్‌సభ ఎన్నికలతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో జనగణన వాయిదా పడింది.2024-2025లో ఈ మొత్తాన్ని కాస్త పెంచి.. రూ.1,309.46 కోట్లు కేటాయించారు. కానీ ఈసారి 2025-2026 బడ్జెట్‌లో దాన్ని సగానికి పైగా తగ్గింది. రూ.8,754.23 కోట్లతో జనగణన.. రూ.3,941.35 కోట్లతో ఎన్‌పీఆర్‌ను ఆధునీకరించేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్‌ 2019 డిసెంబరు 24వ తేదీన ఆమోదముద్ర వేసింది. సాధారణంగా ముందు అనుకున్న ప్రకారం.. 2020 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి సెప్టెంబరు 30వ తేదీ మధ్య దేశంలో జనాభా లెక్కింపు ప్రక్రియ జరగాల్సి ఉండగా.. కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా వాయిదా పడింది. అప్పటినుంచి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. ప్రతీ ఏడాది వాయిదా వేసుకుంటూ వస్తూనే ఉంది.గతేడాది ఏప్రిల్‌ నెలలో చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ నిలిచినట్లు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అయితే జనాభా పరంగా చూస్తే దీనికి కచ్చితమైన లెక్కలు లేవు. వేర్వేరు పథకాలకు సంబంధించి 2011 నాటి గణాంకాల ఆధారంగానే లక్ష్యాలు, వ్యయ అంచనాలు ఇప్పటికీ రూపొందిస్తున్నారు. 2020లో నిర్వహించాల్సిన ఈ జనాభా లెక్కలు ఇప్పటికే 5 ఏళ్లు వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే 9 ఏళ్ల వ్యవధిలో దాదాపు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని నీతి ఆయోగ్‌ లెక్కలు కూడా వెల్లడించింది. అయితే సరైన గణాంకాలు లేకుండా నీతి ఆయోగ్ ఈ ప్రకటన చేయడంపై దేశంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. మరోవైపు.. దేశంలో జనగణన పూర్తి అయి లెక్క తేలే వరకు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ కూడా ఆగాల్సిన పరిస్థితి నెలకొంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్