ప్రజల మౌలిక వసతుల కల్పన ధ్యేయమే మా లక్ష్యం

- Advertisement -

ప్రజల మౌలిక వసతుల కల్పన ధ్యేయమే మా లక్ష్యం

Our mission is to create infrastructure for the people

ఛైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి  సారధ్యంలో నందిగామ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపిస్తాం
ఏపీ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
నందిగామ
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ ఛైర్ పర్సన్ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.  ఛైర్ పర్సన్ మండవ కృష్ణకుమారితో పాటు ఏపీ విప్, ఎమ్మెల్యే  తంగిరాల సౌమ్య కౌన్సిలర్లు మరియు కూటమి నేతలు కాకానీ నగర్ కార్యాలయం నుండి నందిగామ మున్సిపల్ ఆఫీస్ కు ర్యాలీగా వచ్చి ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టారు.
అనంతరం తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ ద్వారా మున్సిపల్ చైర్మన్ టీడీపీ దక్కించుకుందని తెలిపారు. నందిగామను అన్నివిధాలా అభివృద్ధి చేసి చూపుతామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో పనులు చేయకుండా దొంగ బిల్లులతో దోపిడీ చేశారని ఆరోపించారు. వాటి పై విచారణ చేసి తప్పకుండా తప్పు చేసిన వారి పై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సౌమ్య వెల్లడించారు. ప్రజల మౌలిక వసతుల కల్పన ధ్యేయమే మా లక్ష్యమని, ఛైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి  సారధ్యంలో నందిగామ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు.  వాట్సప్ గవర్నెన్స్ ను నందిగామ మున్సిపాలిటీలో అమలుకు ప్రణాళిక సిద్ధం చేస్తామి, నందిగామ మున్సిపాలిటీని  అన్నివిధాలా అభివృద్ధి చేసి చూపుతామని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular