Tuesday, April 1, 2025

అరకు నుంచి అమెరికాకు కాఫీ

- Advertisement -

అరకు నుంచి అమెరికాకు కాఫీ

Coffee from Araku to America

విశాఖపట్టణం, మార్చి 5, (వాయిస్ టుడే )
అరకు కాఫీకి ఆర్గానిక్ సర్టిఫికేషన్ లభించింది. ఇది ఆదివాసీ రైతులకు ఎంతో మేలు చేయనుంది. ఆర్గానిక్ సర్టిఫికేషన్ ద్వారా అరకు కాఫీని యూరప్‌కు ఎగుమతి చేసే అవకాశం వచ్చింది. దీని ద్వారా దాదాపు 2600 మంది రైతులకు లబ్ధి జరగనుంది. అసలు అరకు కాఫీకి ఎందుకంత డిమాండ్.. ఆర్గానికి సర్టిఫికేషన్ అంటే ఏంటీ.. దాని వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.అరకు కాఫీని గిరిజన రైతులు సేంద్రియ ఎరువులు ఉపయోగించి పండిస్తారు. రసాయన మందులు వాడకుండా సహజ పద్ధతుల్లో పండించడం వల్ల ఇది మరింత రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తులో సిల్వర్ ఓక్, మిరియాల చెట్ల మధ్య ఈ కాఫీ తోటలు పెరుగుతాయి. ఈ ప్రత్యేకమైన వాతావరణం వల్ల కాఫీ గింజలకు ఒక ప్రత్యేకమైన రుచి, సువాసన వస్తాయి. అరకులో అరబికా రకం కాఫీని పండిస్తారు. ఈ రకం కాఫీకి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉందిఅరకు కాఫీకి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉంది. దీని రుచి, నాణ్యతకు గాను అనేక అవార్డులు కూడా లభించాయి. అరకు కాఫీ సాగులో గిరిజన రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి శ్రమ, నైపుణ్యం వల్లనే ఈ కాఫీ అంత రుచికరంగా ఉంటుంది. అరకు లోయలో మహిళలు పండిస్తున్న కాఫీలో చక్కటి పరిమళం ఉందని గతంలో ఐరాస ప్రతినిధులు ప్రశంసలు కురిపించారు. కాఫీ సాగు ద్వారా ఆర్థిక సామాజిక విప్లవాన్ని తీసుకురావడంలో అరకు మహిళల కీలక పాత్ర ఉందని, అరకు మహిళలు భారత నారీశక్తికి చిహ్నాలని ఐకాస ప్రతినిధులు కొనియాడారు. అరకు కాఫీ ప్రత్యేకమైన సుగంధ లక్షణాలు కలిగి రుచికి ప్రసిద్ధి చెందింది.ఆర్గానిక్ సర్టిఫికేషన్ వల్ల అరకు కాఫీకి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్గానిక్ సర్టిఫికేషన్ వల్ల యూరప్, అమెరికా వంటి దేశాలకు అరకు కాఫీని ఎగుమతి చేసే అవకాశం పెరుగుతుంది. ఆర్గానిక్ కాఫీకి సాధారణ కాఫీ కంటే ఎక్కువ ధర లభిస్తుంది. ఇది గిరిజన రైతుల ఆదాయాన్ని పెంచుతుంది. ఆర్గానిక్ కాఫీలో రసాయన ఎరువులు, పురుగు మందులు ఉండవు. కాబట్టి ఇది ఆరోగ్యానికి మంచిది. ఆర్గానిక్ వ్యవసాయం పర్యావరణానికి హాని కలిగించదు. ఇది నేల, నీరు, గాలి కాలుష్యాన్ని తగ్గిస్తుంది. ఆర్గానిక్ కాఫీ సాగు గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుంది.అరకు కాఫీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. కాఫీ తాగడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఈ కాఫీ తాగడం వల్ల టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. కాఫీ తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. కాఫీలో కెఫీన్ ఉంటుంది. ఇది శక్తిని పెంచుతుంది, అలసటను తగ్గిస్తుంది. అరకు కాఫీ ఆర్గానిక్ గుర్తింపు పొందడం వల్ల గిరిజన రైతులకు, పర్యావరణానికి, వినియోగదారులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్