టీయూడబ్ల్యూజే ను విమర్శిస్తే ఖబడ్దార్

- Advertisement -

టీయూడబ్ల్యూజే ను విమర్శిస్తే ఖబడ్దార్

వాయిస్ టుడే
జర్నలిస్టులు అనుభవిస్తున్న ప్రతి సంక్షేమం టియుడబ్ల్యూజే కృషి ఫలితమే

If you criticize TUWJ, you are a coward.

-కరీంనగర్ జర్నలిస్టులు ఐక్యంగా ఉండా
లి

-టియుడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ

కరీంనగర్
నిరంతరం జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న టియుడబ్ల్యూజె ను విమర్శిస్తే సహించేది లేదని టియుడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ అన్నారు. టి యు డబ్ల్యూ జిల్లా అధ్యక్షులు గాండ్ల శ్రీనివాస్ అధ్యక్షతన టీయూడబ్ల్యూజే కరీంనగర్ జిల్లా శాఖ విస్తృత సాయి కార్యవర్గ సమావేశం స్థానిక ఎస్ ఆర్ ఆర్ బ్యాంకేట్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ, రాష్ట్ర కార్యదర్శి రామనారాయణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విరహత్ అలీ మాట్లాడుతూ 70 సంవత్సరాల్లో అనేక విజయాలు సాధించిన ఘనత టీయూడబ్ల్యూజే దేనని అన్నారు. అనేక అసంఘటిత శక్తులు యూనియన్ విచ్ఛిన్నం చేయాలని చూసిన కొట్లాడి గెలిచిన సంఘం మనది అన్నారు. సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి అత్యధిక జర్నలిస్టుల సభ్యత్వం కలిగిన సంఘంపై ఉసిగొలిపిన కొట్లాడి నిలబడిన చరిత్ర టీయూడబ్ల్యూజేకు దక్కిందన్నారు. ఈరోజు ప్రతి జర్నలిస్టు పొందుతున్న సంక్షేమం టియుడబ్ల్యూజే కృషి ఫలితమేనని అన్నారు. అనేక ప్రత్యర్థి యూనియన్లు అసత్య ఆరోపణలతో జర్నలిస్టులను తప్పిదారి పట్టిస్తూ కోర్టులను సంప్రదించిన టి యు డబ్ల్యూ జె యూనియన్ నిబద్ధతను చూసి  ప్రత్యర్థి సంఘాలకు కోర్టు లు మొట్టికాయలు వేసిన సంఘటనలు అనేకం ఉన్నాయన్నారు. నాటికి నేటికీ జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న యూనియన్ ఏదన్నా ఉందంటే అది టీ యు డబ్ల్యూ జెనన్నారు. కరీంనగర్ పట్టణ జర్నలిస్టుల నివేషణ స్థలాల సమస్య జటిలం అయ్యేందుకు గత పాలకుల నిర్లక్ష్యమే కారణమన్నారు. జర్నలిస్టులకు సరైన ప్రోసిడింగ్ ఇవ్వకుండా జర్నలిస్టుల మధ్య అవరోధం సృష్టించారన్నారు. అయినా జర్నలిస్టులు ఐక్యంగా ఉంటూ సమస్యలను పరిష్కరించుకోవలసిన ఆవశ్యకత ఉందన్నారు. నివేషణ స్థలాల సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్ర కమిటీ అన్ని విధాలా సహకరించడానికి సిద్ధంగా ఉందన్నారు. టి యు డబ్ల్యూ జె నుండి బహిష్కృత నేత పైశాచిక ఆనందంతో కేసులు వేస్తూ ఆనందిస్తున్నాడన్నారు. వేసిన కేసులు కోర్టులో వీగిపోయి ఆయనకు పరాభవం తప్పదన్నారు. మూడు దశాబ్దాల పాటు యూనియన్ తో ప్రయోజనం పొంది సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి వేలివేయబడ్డ నాయకుడు నేడు జర్నలిస్టులను తప్పుదోవ పట్టించడం పట్ల కరీంనగర్ జర్నలిస్టులు జాగ్రత్తగా ఉండాలన్నారు. జర్నలిస్టులంతా సంఘటితంగా ఉండి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని అడ్డుకోవాలని అన్నారు. జిల్లా జిల్లా నాయకత్వం జర్నలిస్టులతో సమన్వయంతో ఉంటూ రాష్ట్ర కమిటీ చేసే కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలని సూచించారు. జర్నలిస్టుల ఆరోగ్య సమస్యలపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తో చర్చలు జరిపామని ఆయన సానుకూలంగా స్పందించారని అతి త్వరలో మనం కోరుకునే విధంగానే రిజల్ట్ వస్తుందన్నారు. జర్నలిస్టుల వెల్ఫేర్ ఫండ్ ను సైతం పునరుద్ధరించాలన్నారు. గత ప్రభుత్వం జారీ చేసిన అక్రిడేషన్ జీవో అస్తవ్యస్తంగా ఉండడంతో నూతన జీవో జారీ చేయాలని కోర్టు తీర్పు నివ్వడంతో ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ ఇచ్చిన నివేదిక మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి అందజేయడం జరిగిందన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ అందుతుందన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా మండల స్థాయి రిపోర్టర్లకు సైతం అక్రిడిటేషన్లను అందించిన ఘనత టి యు డబ్ల్యూ జే కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొయ్యడ చంద్రశేఖర్, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు నగునూరి శేఖర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎలగందుల రవీందర్,.. కరీంనగర్ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఊరేడి రవీందర్ ఐజేయూ సభ్యుడు జానంపేట మారుతి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఇమామ్, రాష్ట్ర హెల్త్ కమిటీ సభ్యులు బల్మూరు విజయ్ రావు, మహేంద్ర చారి, కోశాధికారి వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు గాండ్ల సంపత్, శైలేందర్ రెడ్డి ఎండి సుకుర్, భరణి కుమార్ సంయుక్త కార్యదర్శులు సిర్ర తిరుపతి కొండల్ రెడ్డి పొలు సంపత్ దాడి సంపత్ లతోపాటు జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా నాయకులు మండల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular