Saturday, February 21, 2026

మరో వివాదంలో దువ్వాడ

- Advertisement -

మరో వివాదంలో దువ్వాడ
శ్రీకాకుళం, ఏప్రిల్ 18, (వాయిస్ టుడే)

Duvvada in another controversy

సిక్కోలు రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్ రూటే సెపరేటు. వైసీపీ నేతగా ఉన్న ఆయన రోజుకో వివాదంలో చిక్కుకుంటూ పాలిటిక్స్ లో హాట్ టాపిగ్గా మారుతున్నారు. ఇప్పటికే కుటుంబ వివాదంలో చిక్కుకొని రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారమే రేపారు. అది కాస్తా సర్ధుమనిగిందకునేలోపే…తాజాగా ఆయన తీసుకున్న డాక్టరేట్ పెద్ద దుమారమే రేపింది.ఊరు పేరు లేని యూనివర్శిటి, యూజీసీ అనుమతి లేని యూనివర్శిటి నుండి డాక్టరేట్ తీసుకున్నారంటూ ఆయన ప్రత్యర్థులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారట. ఆ వివాదం ముగిసేలోపే ఆయన ఇంటికి పవర్ కట్ మరో వివాదంగా మారింది. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి కరెంట్ బిల్లులు కట్టలేదని పవర్ కట్ చేశారట విద్యుత్ శాఖ అధికారులు. దీంతో ఆ అధికారికి ఫోన్ చేసిన దువ్వాడ..నోటికి ఎంత వస్తే అంతలా మాట్లాడారంటా. దళిత అధికారిపై ఇలా దుర్భాషలేంటంటూ లీకైన ఆడియో ఇప్పుడు వైరల్ గా మారింది.ఇలా దువ్వాడ ఏం చేసినా అది వివాదాలకు, కాంట్రవర్సీలకు దారి తీస్తుండటం ఇటు వైసిపి అధిష్టానానికే కాదు అటు ఆయన అనుచరులకు సైతం మింగుడు పడటంలేదట. దువ్వాడను నిత్యం వివాదాలు వెంటాడుతుండడంతో పార్టీ అధిష్టానం కూడా ఆయనపై చర్యలకు దిగుతోంది.కుటుంబ వివాదంతో పార్టీకి భారీగా డ్యామేజి అవుతుందని భావించిన వైసిపి ఆయన్ని టెక్కలి నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతల నుంచి ఇటీవల తప్పించింది. ఆ బాధ్యతలను…ఇటీవల ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన పేరాడ తిలక్ కి అప్పగించారు. దీంతో అప్పటి నుండి దువ్వాడ శ్రీనివాస్ పార్టీకి అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారట. పార్టీ కార్యక్రమాలకు పిలుపునిచ్చినా కూడా వాటికి దూరంగా ఉంటూ సొంత వ్యవహారాలనే చక్కబెట్టుకుంటున్నారంట.అంతేకాదు దువ్వాడ భార్య వాణి సైతం దువ్వాడకు చెక్ పెట్టేందుకు టెక్కలి వైసీపీ ఇంచార్జ్ పేరాడ తిలక్ తో కలిసి పనిచేస్తున్నారంట. ఓ వైపు కుటుంబ వివాదాలు..మరో వైపు వరుసగా చుట్టుముడుతున్న కాంట్రవర్శిలు..ఇలా దువ్వాడకు ముందు నుయ్యి..వెనక గొయ్యిలా మారిందంటున్నారు ఆయన కేడర్. వరుస వివాదాలు వెంటాడుతున్న దువ్వాడ ప్రస్తుతం తన సహచరి దివ్వల మాదురితో కలిసి వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించారంట. అక్కడ బిజిగా ఉంటూనే కాంట్రవర్శిలకు మాత్రం కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూనే ఉన్నారు దువ్వాడ శ్రీనివాస్.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్