Tuesday, February 24, 2026

ప్రధాని మోదీకి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక విజ్ఞప్తి

- Advertisement -

కంచగచ్చిబౌలి భూముల ఆర్థిక అక్రమాలపై విచారణ జరపాలి
     ప్రధాని మోదీకి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక విజ్ఞప్తి
హైదరాబాద్‌ ఏప్రిల్ 18

BRS Working President KTR's key appeal to Prime Minister Modi

ప్రధాని మోదీకి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక విజ్ఞప్తి చేశారు. పర్యావరణంపై ప్రధానిగా తన చిత్తశుద్ధి, బాధ్యతను నిరూపించుకోవాల్సిన సమయం ఇది. కంచగచ్చిబౌలి భూముల ఆర్థిక అక్రమాలపై విచారణ జరిపి కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలి. హెచ్‌సీయూలో జరిగిన విధ్వంసం విషయంలో మోదీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. హెచ్‌సీయూలో సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన విధ్వంసంపై ప్రధాని మోదీ మాట్లాడింది కేవలం బూటకం కాకుంటే చర్యలు తీసుకోవాలి. కంచ గచ్చిబౌలి అంశం వందల ఎకరాల పర్యావరణ విధ్వంసం మాత్రమే కాదు, కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన రూ.10 వేల కోట్ల ఆర్థిక మోసం. కాంగ్రెస్‌ చేసిన ఆర్థిక మోసంపై ఇప్పటికే సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌, సీబీఐ, ఆబీఐ, సెబీ, ఎస్‌ఎఫ్‌ఐఓలకు ఆధారాలతో సహా తెలియజేశాం. ఆర్థిక అవకతవకలు జరిగినట్టు కేంద్ర సాధికార కమిటీ కూడా నిర్ధారించింది. స్వతంత్ర విచారణ చేయాలని కేంద్ర సాధికార కమిటీ సూచించింది. ఆర్థిక అక్రమాలపై వెంటనే కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలి.నగరాలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. నిస్సిగ్గుగా, అక్రమంగా పర్యావరణ విధ్వంసం చేసిన రేవంత్‌ రెడ్డి లాంటి నాయకులను ప్రజల ముందు నిలబెట్టాల్సిన అవసరం ఉంది. కంచ గచ్చిబౌలిలో రూ.10 వేల కోట్ల ఆర్థిక అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టాలి. ప్రధానిగా పర్యావరణ పరిరక్షణ, నిర్వహణపై చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌ ఒక్కటి కాదని, కుమ్మక్కు రాజకీయాలు చేయడం లేదని నిరూపించుకోవాలి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్