Sunday, January 25, 2026

 ఆయుర్వేదంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

- Advertisement -

 ఆయుర్వేదంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
హైదరాబాద్, ఏప్రిల్ 30, (వాయిస్ టుడే)

Artificial Intelligence in Ayurveda

భారత హెల్త్ కేర్ రంగం అద్భుతమైన పురోగతి సాధిస్తోంది. ఆధునిక సాంకేతికకు మూలికా, ఆయుర్వేద నివారణలను మిళితం చేయడం చేయడం ద్వారా మెరుగైన చికిత్స అందించడానికి,  సంప్రదాయ, ఆయుర్వేదంతో కొత్త మందులు అందించడానికి అవకాశం ఏర్పడుతోదంి.  భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తు వేగంగా అభివృద్ది చెందుతోంది. వ్యాధి నిర్దారణ, నివారణ, ఆవిష్కరణ, పరిశోధన ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. పతంజలి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, డాబర్ ఇండియా లిమిటెడ్ తో పాటు  సన్ హెర్బల్స్ వంటి దేశంలోని అనేక కంపెనీలు, సంస్థలు ఆయుర్వేద మందుల కోసం క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. ఆరోగ్య సంరక్షణ మందుల తయారీలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.  ఆయుష్మాన్ భారత్ , డిజిటల్ హెల్త్ మిషన్ వంటి ప్రభుత్వ కార్యక్రమాలు గ్రామీణ , పట్టణ ప్రాంతాలలో ఆరోగ్య సంరక్షణ సేవలకు అవకాశాలను పెంచాయి.భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తు ఆవిష్కరణ , పరిశోధన ద్వారా వేగంగా మారుతోంది. దేశంలోని టెలిమెడిసిన్ ,  ఇ-సంజీవని వంటి వేదికలు మారుమూల రోగులకు ప్రత్యేక వైద్య  సేవలు అందిస్తున్నాయి. వారి ఆరోగ్యాలను కాపాడుతున్నాయి.  సాంకేతిక అభివృద్ధి, కృత్రిమ మేధస్సు, బయోటెక్నాలజీ , డిజిటల్ ఆరోగ్య పరిష్కారాల ద్వారా, దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సామాన్య ప్రజలకూ అందుబాటులోకి వస్తోంది. తక్కువ ధరల్లోనే  ప్రభావవంతమైన వైద్యం అందుతోందది. క్షయ,  ఊపిరితిత్తుల వ్యాధులను ముందస్తుగా గుర్తించడానికి అనుమతించే ఎక్స్-రేలు ,  సీటీ స్కాన్‌లను విశ్లేషించడానికి AI ని ఉపయోగిస్తున్నారు.  టెలిమెడిసిన్‌లో ప్రాక్టో , 1mg వంటి ప్లాట్‌ఫామ్‌లు గ్రామీణ ప్రాంతాల్లో  కూడా మంచి వైద్యులను సంప్రదించగలిగేలా చేస్తున్నాయి.  పతంజలి పరిశోధనా సంస్థ (PRI)లోని 500 మందికి పైగా శాస్త్రవేత్తలు ఆయుర్వేదాన్ని ఆధునిక వైద్య శాస్త్రంతో కలిపి పరిశోధనలు చేస్తున్నారు.  ఔషధాలను అభివృద్ధి చేస్తున్నారని కంపెనీ చెబుతోంది. పతంజలి టెలిమెడిసిన్ చొరవ ,  మూలికా ఉత్పత్తులు భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో  తక్కువ ధరకు, అ  ఆరోగ్య సంరక్షణ సేవలను అందుబాటులోకి తీసుకెళ్తున్నాయని పతంజలి తెలిపింది.  పర్యావరణ అనుకూల ఉత్పత్తులు ,  సేంద్రీయ వ్యవసాయం ఇప్పుడు దేశంలో టెండ్ర్‌గా మారింది. “మా పరిశోధన పెట్టుబడి ఆయుర్వేదాన్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడంలో ముఖ్యమైన పాత్ర పోషించాయి. పతంజలి చేసిన ఈ ప్రయత్నం ఆరోగ్య సంరక్షణ సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా, ప్రపంచ వేదికపై భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రముఖంగా నిలబెడుతోంది.” అని పతంజలి తెలిపింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్