తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల
Tenth class results released in Telangana
92.78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత
టెన్త్ ఫలితాలను ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి
గతేడాది కంటే 1.47 శాతం అధికంగా విద్యార్థులు ఉత్తీర్ణత
ఈ సారి కూడా బాలికలదే పైచేయి
బాలురు 91.32 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలికలు 94.26 శాతం ఉత్తీర్ణత
99.29 శాతంతో ప్రథమ స్థానంలో మహబూబ్‌నగర్ జిల్లా
73.97 శాతంతో చివరి స్థానంలో వికారాబాద్ జిల్లా
హైదరాబాద్ ఏప్రిల్ 30
తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. టెన్త్ ఫలితాలను ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి బుధవారం రవీంద్రభారతిలో విడుదల చేశారు. 92.78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గతేడాది కంటే 1.47 శాతం అధికంగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరిగిన పది పరీక్షలకు దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.దో తరగతిలో ఈసారి కొత్తగా సబ్జెక్టుల వారీగా మార్కులతో పాటు గ్రేడింగ్ కూడా ఇచ్చారు. ఈ విధనంగా మార్కుల మెమోలు జారీ చేయనున్నారు. మార్కుల మెమోలపైనా సబ్జెక్టుల వారీగా రాత పరీక్షలు, ఇంటర్నల్ పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడ్ పొందుపరిచారు విద్యార్థి పాసయ్యారా..? ఫెయిల్ అయ్యారా…? అనేది మాత్రమే ఫలితాలలో కనిపిస్తుంది. ఇంకా బోధనేతర కార్యక్రమాల (కో కరిక్యులర్ యాక్టివిటీస్)లో విద్యార్థులకు గ్రేడ్లు ఇస్తారు.
సిబిఎస్‌ఇ తరహాలో మెమోలు
ప్రస్తుతం సిబిఎస్‌ఇలో సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లను ముద్రిస్తున్నారు. గురుకులాల్లో 96 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. గత ఏడాదితో పోలిస్తే 1.47 శాతం అధికంగా ఉత్తీర్ణత నమోదు అయ్యింది. బాలురు 91.32 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలికలు 94.26 శాతం ఉత్తీర్ణత పొందారు. ఈ సారి కూడా బాలికలదే పైచేయిగా నిలిచింది. బాలుర కంటే బాలిలు 2.94 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది 4,629 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. అలాగే రెండు పాఠశాలలు మాత్రం సున్నా శాతం ఫలితాలు పొందాయి. టెన్త్ ఫలితాల్లో మహబూబ్‌నగర్ జిల్లా 99.29 శాతంతో ప్రథమ స్థానంలో ఉండగా.. వికారాబాద్ జిల్లా 73.97 శాతంతో చివరి స్థానంలో నిలిచింది.
మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరిగాయి. దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కావడం.. మార్కుల మెమోలను ఎలా ఇవ్వాలన్న అంశంపై ఇప్పటికే అధికారులకు పూర్తిస్థాయి స్పష్టత వచ్చింది. దీంతో ఈ పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదల చేశారు.డ్యుకేషన్, ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అనే నాలుగు కో కరిక్యులర్ యాక్టివిటీస్‌కు సంబంధించిన గ్రేడ్లు కూడా ముద్రించారు.



