సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిని ఖండించిన ఎంపీ వద్దిరాజు
MP Vaddiraju condemns attack on Sircilla MLA camp office by Congress workers
సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ పాలకులు ఈవిధమైన దాడులను ప్రోత్సహిస్తూ”డైవర్షన్ పాలిటిక్స్”పాల్పడుతూ ప్రజాస్వామ్య విలువలను పాతరేస్తున్నారని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. స్థానిక శాసనసభ్యుడి అధికారిక క్యాంపు కార్యాలయంపై దాడికి దిగిన కాంగ్రెస్ గుండాలను అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అత్యుత్సాహం కనబర్చి లాఠీలతో చితకబాదడం శోచనీయమని ఎంపీ రవిచంద్ర అన్నారు.క్యాంపు కార్యాలయంపై దాడికి దిగిన కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఎంపీ వద్దిరాజు పోలీస్ అధికారులను డిమాండ్ చేశారు.



