Thursday, March 12, 2026

టీపీసీసీలో సామాజిక న్యాయం సాధ్యమా..

- Advertisement -

టీపీసీసీలో సామాజిక న్యాయం సాధ్యమా..
హైదరాబాద్, మే 27 (న్యూస్ పల్స్)

Is it a strategy... is it a strategy...

తెలంగాణలో కుల గణన ఇటీవలే జరిగింది. ఇది దేశమంతటా అమలు చేయాలని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రతీ వేదికపైన  “జిత్నీ ఆబాదీ, ఉత్నా హక్” (ఎంత జనాభా ఉంటే అంత హక్కు)  కల్పించాలని  ఆ పార్టీ అగ్రనేత , లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ  ప్రవచిస్తున్న విషయం తెలిసిందే.  అయితే  తెలంగాణ సర్కార్ తమ పార్టీ ఆదేశాలకు అనుగుణంగా కుల గణన విషయంలో రాకెట్ వేగంతో పని చేసింది.  తెలంగాణ రాష్ట్రంలో కుల గణన పూర్తి చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపంది. తెలంగాణ  మోడల్ అనుసరించి దేశ వ్యాప్తంగా  జన గణన సమయంలోనే కుల గణన జరపాలని డిమాండ్  చేసింది.  ముందు ససేమిరా అన్న ఎన్డీఏ ప్రభుత్వం  జన గణనతో పాటు కుల గణన చేస్తామని చెప్పి ఓ కొత్త రాజకీయ వ్యూహాన్ని ముందుకు తెచ్చింది. అయితే ఇప్పుడు  తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరో సాహసోపేతమైన  నిర్ణయానికి సిద్ధమవుతుందా లేదా అన్న చర్చ సాగుతోంది. టీపీసీసీ కమిటీల నియామకంలో కుల గణనకు అనుగుణంగా కమిటీల కూర్పు ఉంటుందా లేదా అన్న  ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే సీఎం  రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్  మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీలో ఉన్నారు. ఏఐసీసీ  సంస్థాగత వ్యవహారాల ఇన్ చార్జ్ కేసీ వేణుగోపాల్  తో పీసీసీ కమిటీల కూర్పు, మంత్రి వర్గ విస్తరణపై  చర్చలు జరుపుతున్నారు. అయితే ఇప్పుడు ఆ కమిటీలు రాహుల్ గాంధీ  డిమాండ్ చేసినట్లు  జనభా ప్రాతిపదికన ఉంటుందా , రాష్ట్రంలో కుల గణనకు అనుగుణంగా సామాజిక వర్గాల నేతలకు న్యాయం చేస్తారా లేదా అన్నదే ఇప్పుడు ముందున్న ప్రశ్నతెలంగాణ కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు అనేది అప్పటి పరిస్థితులను బట్టి, ఆశావాహులను బట్టి, పార్టీలో అసంతృప్త నేతలను సంతృప్తి పరచాల్సి ఉంటుంది , ఈ  కారణాలను బట్టి టీపీసీసీ  స్వరూపం తరచూ మారూతూ ఉంటుంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు –  ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించే అత్యంత కీలకమైన పదవి. ప్రస్తుతం బీసీ నాయకుడు అయిన బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్  ఈ పదవిలో కొనసాగుతున్నారు. వర్కింగ్ ప్రసిడెండ్  లేదా కార్యనిర్వాహక అధ్యక్షులు –  పార్టీ అధ్యక్షుడికి  పార్టీ కార్యక్రమాల్లో సహాయకారిగా ఉండేందుకు  ఈ పదవిని ఏర్పాటు చేయడం జరిగింది.  ప్రస్తుతం నలుగురు వర్కింగ్ ప్రసిడెంట్లను నియమిస్తున్నారు.  ఇందులో పార్టీ సీనియారిటీ,  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళ కోటాలను పరిగణలోకి తీసుకుని వర్కింగ్ ప్రసిడెంట్లను పార్టీ నియమిస్తుంది. వైస్ ప్రసిడెంట్స్ లేదా ఉపాధ్యక్షులు –   టీపీసీసీలో వర్కింగ్ ప్రసిడంట్స్ తర్వాత కీలక పదవి ఇది.  వీరు పార్టీ కార్యకలాపాల్లో కీలక పాత్ర వహిస్తూ, పార్టీ బలోపేతానికి కృషి చేస్తారు.  అటు పీసీసీ చీఫ్ తో పాటు వర్కింగ్ ప్రసిడెంట్లతో సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను నిర్వర్తిస్తారు. దాదాపు 10 నుండి 20 మంది వరకు పార్టీ ఉపాధ్యక్షులుగా  ఉండే అవకాశం ఉంది. సందర్భానుసారంగా ఈ సంఖ్య మారే అవకాశం ఉంది.పార్టీ జనరల్ సెక్రటరీస్ లేదా ప్రధాన కార్యదర్శులు –  పార్టీలో మరో కీలకమైన పదవి ప్రధాన కార్యదర్శి పదవి. వీరు పార్టీలోని  అంతర్గత, సంస్థాగత వ్యవహాలను చూస్తారు.  ప్రతీ జిల్లా నుంచి ఇద్దరు  ప్రధాన కార్యదర్శుల ఉండే అవకాశం ఉంది.  ఆ జిల్లాను సమన్వయం చేయడానికి . ఇక హైదరాబాద్, రంగా రెడ్డి నుండి ఎక్కు మంది ప్రధాన కార్యదర్శులు ఉండే అవకాశం ఉంది.  దాదాపు 80 మంది ప్రధాన కార్యదర్శులుగా ఉండే అవకాశం ఉంది. పార్టీ  సెక్రటరీస్ లేదా కార్యదర్శులు –  పార్టీ ఇచ్చే కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో వీరు కీలకంగా పని చేస్తారు. క్షేత్ర స్థాయిలో అటు ప్రజలు, ఇటు పార్టీ కార్యకర్తలతో కలిసి పని చేస్తారు. పార్టీ తీసుకునే నిర్ణయాలను వీరు అమలు చేస్తారు. దాదాపు 40 మందిని ఈ పదవుల్లో నియమించే అవకాశం ఉందిపార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ లేదా పార్టీ అధికార ప్రతినిధులు – వీరు పార్టీ తీసుకున్న నిర్ణయాలను, పార్టీ కార్యక్రమాలను, ఆయా అంశాలపై పార్టీ తీసుకునే  స్టాండ్ ను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తారు. వీరు దాదాపు  ఐదు నుండి పది మంది ఉండే అవకాశం ఉందిపార్టీ క్యాంపెయిన్ కమిటీ లేదా ప్రచార కమిటీ –  ఈ కమిటీ పార్టీ కి సంబంధించిన ప్రచార కార్యక్రమాలను రూపొందించడం, వాటిని  అమలు చేయడం ప్రధాన విధి. ఇది ఎన్నికల అవసరాలను బట్టి ప్రచార కమిటీ సభ్యుల సంఖ్య మారుతూ ఉంటుంది.డిసిప్లినరీ యాక్షన్ కమిటీ లేదా క్రమ శిక్షణ కమిటీ –  ఇది పార్టీ సభ్యులు, పార్టీ నియమాలకు అనుగుణంగా ఉండేలా చూస్తుంది. ఎవరైనా పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే  ఆ సభ్యులను విచారిస్తుంది.  తప్పని తెలితే తీసుకోవాల్సిన క్రమ  శిక్షణ చర్యలను పార్టీ అధ్యక్షునికి సిఫారసు చేస్తుంది. ఇందులో పార్టీలోని సీనియర్లను నియమిస్తారు. దాదాపు  7గురి వరకు అవకాశం కల్పించ వచ్చు.ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ రూపొందించిన దేశ వ్యాప్త కార్యక్రమాలు లేదా ప్రచార కార్యక్రమాలను రాష్ట్రంలో అమలు చేసేలా చూస్తుంది.  ఏఐసీసీ  చేసే సూచనలను, ఆదేశాలను పార్టీలోను, రాష్ట్రంలో పార్టీ తరపున అమలు చేసే కమిటీ. ఏఐసీసీకి, రాష్ట్ర పార్టీకి మధ్య అనుసంధాన కర్తగా ఈ కమిటీ పని చేస్తుంది.రాజకీయ వ్యవహారాల కమిటీ (పొలిటికల్ అఫైర్స్ కమిటీ ) –  ఈ కమిటీలో పార్టీ సీనియర్ నేతలు సభ్యులుగా ఉంటారు. వీరు పార్టీకి సంబంధించి రాష్ట్రంలో తీసుకోవాల్సిన రాజకీయ నిర్ణయాలను ఈ కమిటీ  తీసుకుంటుంది.  అవసరమైన సలహాలు సూచనలను పార్టీకి అందిస్తుంది. ఈ కమిటీలతో పాటు చేరికల కమిటీ,  ఎన్నికల సమయంలో పార్టీ మ్యానిఫెస్టో తయారు చేసే కమిటీల వంటిివి ఉంటాయి.  ఇక క్షేత్ర స్థాయిలో జిల్లా కమిటీలు, బ్లాక్, మండల, గ్రామ కమిటీలు ఉంటాయి.  కార్మిక, రైతు, విద్యార్థి , యువత, మహిళ, మైనార్టీ వంటి అనుబంధ కమిటీలు ఉంటాయి.  ఈ కమిటీల కూర్పు  పార్టీ సీనియారిటీ, వారి పని తీరు, కుల సమీకరణలను బట్టి  జరుగుతుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్