Saturday, February 14, 2026

 *‘షష్టిపూర్తి’ కోసం పెట్టిన బడ్జెట్ అంతా కూడా తెరపై కనిపిస్తుంది – హీరో, నిర్మాత రూపేశ్*

- Advertisement -

 *‘షష్టిపూర్తి’ కోసం పెట్టిన బడ్జెట్ అంతా కూడా తెరపై కనిపిస్తుంది – హీరో, నిర్మాత రూపేశ్*

The entire budget for 'Shashtipooorthi' will be visible on screen - Hero, Producer Rupesh*

ప్రస్తుతం ఉన్న తరుణంలో ఓ ఫ్యామిలీ ఎమోషన్స్, కుటుంబ కథా చిత్రాలు, విలువలను చాటి చెప్పే కథల్ని నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి ఓ సందేశాత్మక చిత్రంగా ‘షష్టిపూర్తి’ సినిమాను రూపేశ్ నిర్మించారు. నిర్మాతగానే కాకుండా హీరోగానూ నటించారు. డా. రాజేంద్ర ప్రసాద్, నటి అర్చన, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రాన్ని పవన్ ప్రభ తెరకెక్కించారు. మా ఆయి (MAA AAIE) ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం మే 30న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో హీరో, నిర్మాత రూపేశ్ మంగళవారం (మే 27) నాడు మీడియాతో ముచ్చటిస్తూ సినిమా గురించి ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. ఆయన చెప్పిన విశేషాలివే..
* ‘షష్టిపూర్తి’ కథ నాకు చాలా నచ్చింది. ప్రస్తుతం ఇలాంటి కథలే రావడం లేదు. హింసతో కూడిన చిత్రాలే వస్తున్నాయి. ఇలాంటి విలువలతో స్క్రిప్ట్ నా వద్దకు రావడంతో ఎంతో ఆనందించాను. ఇందులో అన్ని రకాల అంశాలుంటాయి. ఈ చిత్రాన్ని నిర్మించడం ఆనందంగానే ఉన్నా.. నటించడాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేశాను.

* ‘షష్టిపూర్తి’ పూర్తిగా కల్పిత చిత్రమే. కానీ ఇందులోని పాత్రల్ని చూస్తే ఆడియెన్స్ మాత్రం తమని తాము చూసుకున్నట్టుగా కనెక్ట్ అవుతారు. ప్రస్తుతం అసలు స్వచ్చమైన ప్రేమను కూడా చూపించడం లేదు. ఇందులో కుటుంబ అంశాలతో పాటుగా అన్ని రకాల ఎమోషన్స్‌ను చూపించాం.

* ‘షష్టిపూర్తి’ కథను రాజేంద్ర ప్రసాద్ గారి కోసమే పవన్ ప్రభ రాసుకున్నారు. ఆయన కొడుకుగా నటించే వారిది కొత్త మొహం అయితే ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాను చూస్తారు. అందుకే కొత్త ఫేస్ కోసం దర్శకుడు చూశారు. చివరకు నేను ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాను.
* ఇళయరాజా గారి మ్యూజిక్‌తో సినిమా స్థాయి పెరిగింది. ఆయన మాకు ఎంతో సహకరించారు. ప్రతీ పాటకు ఎన్నో ఆప్షన్స్ ఇచ్చారు. బయట ప్రచారం జరిగినట్టుగా అక్కడ ఏమీ జరగలేదు. కీరవాణి గారు అడిగిన వెంటనే పాటను రాసి ఇచ్చారు. చైతన్య ప్రసాద్ గారి వల్లే ఇదంతా సాధ్యమైంది. ఇందులోని  పాటలు, ఆర్ఆర్ ఆడియెన్స్‌ను కదిలిస్తాయి.
* ‘షష్టిపూర్తి’ కథ విన్న తరువాత ఇలాంటి పెద్ద టీం ఉండాల్సిందే అని ఫిక్స్ అయ్యాను. అందుకే పెద్ద పెద్ద టెక్నీషియన్ల కోసం ట్రై చేశాం. బడ్జెట్ అనుకున్న దాని కంటే ఎక్కువే అయింది. అయితే ఆ ఖర్చు పెట్టింది అంతా కూడా తెరపై కనిపిస్తుంది. అయితే ఎవ్వరూ కూడా ఇంత ఇవ్వాలని డిమాండ్ చేయలేదు.
* ‘షష్టిపూర్తి’  కోసం చాలా వర్క్ షాప్స్ చేశాం. నాకు అయితే ఎమోషనల్ సీన్స్ చేయడం సులభం అనిపిస్తుంది. అది నా ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు.

* ‘షష్టిపూర్తి’ కథ వినే పెద్ద టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. కథలో బలం ఉందనే ఇళయరాజా గారు, తోట తరణి గారు ఒప్పుకున్నారు. దానికి తగ్గట్టే మంచి అవుట్ పుట్ వచ్చింది. నేను ముందుగా ఈ ప్రాజెక్ట్‌లోకి నిర్మాతగా ఎంట్రీ ఇచ్చాను. మా ఆయి ప్రొడక్షన్స్ అంటే.. మా అమ్మ ప్రొడక్షన్ అని అర్థం. అమ్మ జ్ఞాపకార్థంగానే అలా పెట్టుకున్నాను. అవుట్ పుట్ పట్ల చాలా సంతోషంగా ఉన్నాను.
* రాజేంద్ర ప్రసాద్ గారైనా, అర్చన గారైనా, ఇళయరాజా గారైనా సరే ఏదైనా ఒక పని చేస్తే వంద శాతం ఫోకస్డ్‌గా ఉంటారు. అందుకే వాళ్లు ఆ స్థాయికి వెళ్లారు. ఏ పని చేసినా వంద శాతం ఫోకస్డ్‌గా చేయాలని వాళ్లని చూసి నేర్చుకున్నాను.
* ‘షష్టిపూర్తి’ చిత్రంలో అందమైన ప్రేమ కథ కూడా ఉంటుంది. ఈ మధ్య కాలంలో అలాంటి ఓ సింపుల్, సెన్సిబుల్ లవ్ స్టోరీ రాలేదు. ఆకాంక్ష చక్కగా నటించారు. ఆమెతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. కమర్షియల్ కోసం ఎలాంటి అనవసరపు అంశాల్ని జోడించలేదు. కథకు తగ్గట్టుగా ఇళయరాజా గారు అద్భుతమైన సంగీతం, పాటలు అందించారు. యువన్ శంకర్ రాజా గారు పాడిన ఎరోటిక్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్