రోశయ్య విగ్రహ ఆవిష్కరణ
సీఎం రేవంత్ కు ధన్యవాదాలు తెలిపిన రోశయ్య ఫోరం
హైదరాబాద్
Rosaiah statue unveiling
మాజీ ముఖ్యమంత్రి, కోణిజెటి రోశయ్య విగ్రహ ఏర్పాటు కు తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపడం పై డాక్టర్ కోఫిజెటి రోశయ్య మెమోరియల్ ఫోరమ్ హర్షం వ్యక్తం చేసింది, ఈ మేరకు గురువారం రోశయ్య నివాసం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మెమోరియల్ ఫోరమ్ సభ్యులు కామిశెట్టి అనిల్ కుమార్, ఫెడరేషన్ అఫ్ అవొపాస్ జాతీయ అధ్యక్షులు, సి ఏ బెల్ది శ్రీధర్ లు మాట్లాడుతూ గత రోశయ్య వర్ధంతి సభ కు ముఖ్య అతిధి గా హాజరు ఐన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రోశయ్య జయంతి జులై 4 న ని అధికారకంగా నిర్వహిస్తామని ప్రకటించడం హర్షనీయమన్నారు. అతి తక్కువ సమయంలో కోణాజెటి రోశయ్య విగ్రహ ఏర్పాటు చేసి నేడు ఆవిష్కరణ చేయడం పై యావత్ వైశ్య జాతి ఆనందం వ్యక్తం చేస్తుందని అన్నారు. రోశయ్య రి జ్ఞాపకర్థం ఆమీర్పేట్ లో ఉన్న ప్రకృతి వైద్య కళాశాల కి కే రో
శయ్య ప్రకృతి వైద్య కళాశాల గా పేరు పెట్టడం యావత్ వైశ్య జాతి కి గర్వకారణమని అన్నారు. రేపు జరగ బోయే రోషయ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమనికి, జయంతి సభ కి రెండు తెలుగు రాష్టాల వైశ్యలు హాజరు కావాలని పిలుపునిచ్చారు.



