Sunday, March 15, 2026

ఏడు ఖండాలలో ఐక్యతే లక్ష్యం “ఒకే లక్ష్యం… ఒకే ఒక ధ్యేయం :”గ్లోబల్ మున్నూరుకాపు మహాసభ”

- Advertisement -

ఏడు ఖండాలలో ఐక్యతే లక్ష్యం
– ప్రపంచానికి మున్నూరుకాపుల సంస్కృతి, సంప్రదాయాలు చాటడమే ధ్యేయం
– న్యూజెర్సీలో పురుడు పోసుకున్న గ్లోబల్ మున్నూరుకాపు అసోసియేషన్
– ఆపదలో అండగా.. విద్యా, ఉద్యోగ, ఇమ్మిగ్రేషన్ సమస్యలకు పరిష్కారం
– విస్తృత సేవలు అందిస్తున్న సంస్థ
– ఆగస్టు 30, 31 తేదీల్లో వాషింగ్టన్ డీసీలో తొలి “గ్లోబల్ మున్నూరుకాపు మహాసభ”
– ఘనంగా నిర్వహణకు సన్నాహాలు

కరీంనగర్:వాయిస్ టుడే

The goal is unity across seven continents. "One goal... one purpose:"Global Munnurukapu Mahasabha"
The goal is unity across seven continents. “One goal… one purpose:”Global Munnurukapu Mahasabha”

The goal is unity across seven continents. "One goal... one purpose:"Global Munnurukapu Mahasabha"

“ఒకే లక్ష్యం… ఒకే ఒక ధ్యేయం – ఐక్యత, అభివృద్ధి, సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పాలి” అనే దృఢ సంకల్పంతో ఆవిర్భవించింది గ్లోబల్ మున్నూరుకాపు అసోసియేషన్ ( జీఎం ఏ). దేశం కాని దేశంలో విడివిడిగా కాకుండా సంఘటితంగా ఉంటేనే బలం అనే ఆలోచనతో మున్నూరుకాపు కుల పెద్దలు ఏకమయ్యారు. 2023లో ఉత్తర అమెరికాలోని న్యూజెర్సీ గడ్డపై పురుడు పోసుకున్న ఈ సంస్థ, అమెరికా, ఆసియా, ఆఫ్రికా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా సహా యూరప్ ఖండాలలో తమ సేవలను విస్తరిస్తోంది.

నిస్వార్థ సేవతో మున్నూరుకాపుల అభ్యున్నతే లక్ష్యం…
వ్యవసాయమే ప్రధాన వృత్తిగా, గ్రామీణ ప్రాంతాల్లో పంటలు పండిస్తూ ప్రజలకు ఆహారం అందిస్తున్న మున్నూరుకాపుల అభివృద్ధే ధ్యేయంగా జీఎంఏ నిస్వార్థ సేవలను అందిస్తోంది. ఏడు ఖండాల్లోని మున్నూరుకాపులను ఏకం చేయాలనే ఏకైక లక్ష్యంతో ఏర్పడిన ఈ సంస్థ, విస్తృతమైన కమిటీ వ్యవస్థను కలిగి ఉంది. ఇందులో 10 మంది వ్యవస్థాపకులు (ఫౌండర్స్), ఆరుగురు సభ్యులతో కూడిన ఎగ్జిక్యూటివ్ కమిటీ, 15 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఉంటారు. అమెరికాను మొత్తం ఎనిమిది డివిజన్లుగా విభజించి, ఒక్కో డివిజన్‌కు 15 మంది సభ్యులతో కమిటీలు వేశారు. 150 మంది వాలంటీర్లు 24 గంటలూ అందుబాటులో ఉంటారు.

బతుకుదెరువు కోసం ఖండాంతరాలను దాటి అమెరికాకు వెళ్లే మున్నూరుకాపు బిడ్డలకు “మేమున్నాం” అంటూ జీఎంఏ భరోసా కల్పిస్తుంది. ఆపద సమయంలో అండదండగా ఉంటూ అక్కున చేర్చుకుంటుంది. విద్య, ఉద్యోగం, ఉపాధి, వాణిజ్యం కోసం యుఎస్ వెళ్లిన వారికి పాస్‌పోర్ట్, ఇమ్మిగ్రేషన్ సహా ఇతర సమస్యలు వచ్చినప్పుడు జీఎంఏ వెంటనే పరిష్కరిస్తుంది. విద్యార్థులు ఎదుర్కొంటున్న న్యాయపరమైన సమస్యలకు న్యాయవాదులతో స్పెషల్ సెషన్స్ ఏర్పాటు చేసి ఉచిత న్యాయ సలహాలు ఇప్పిస్తుంది. అంతేకాకుండా, విద్యార్థులకు ఉచితంగా ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇప్పించి, ఆర్థికంగా నిలదొక్కుకునేలా అవకాశాలు కల్పిస్తుంది. యువశక్తి, నారీశక్తి, వివాహ పరిచయ వేదికలను ఏర్పాటు చేసి సహాయ సహకారాలను అందిస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో కోవిడ్ బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచి సేవలందించింది.

సంస్కృతి పరిరక్షణకు, ఐక్యతకు ప్రత్యేక కార్యక్రమాలు
కుల ఐక్యత, అభివృద్ధిని పెంపొందించడమే కాకుండా, కంప్యూటర్ యుగంలో కనుమరుగవుతున్న సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటంలో కూడా జీఎంఏ కీలక పాత్ర పోషిస్తోంది. మున్నూరుకాపుల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ, వాటిని యువతరానికి అందిస్తోంది. పండుగలు, పబ్బాల సమయంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న కులసోదరులను ఒకే వేదిక మీద చేర్చి ఐక్యతను చాటుతుంది. క్రమం తప్పకుండా సంవత్సరానికి రెండుసార్లు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. మదర్స్‌ డే నుండి స్పోర్ట్స్ డే వరకు, శ్రీ సీతారాముల కళ్యాణం సహా ఎన్నో రకాలైన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించింది. ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందిస్తూ, విశ్వవ్యాప్తంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ, సమాజానికి ఆదర్శంగా నిలిచేలా మున్నూరుకాపులను తీర్చిదిద్దుతుంది.

వాషింగ్టన్ డీసీలో తొలి గ్లోబల్ మున్నూరుకాపు మహాసభ
మున్నూరుకాపులు గర్వంగా నిలిచేలా, మన సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసేందుకు జీఎంఏ అహర్నిశలు కృషి చేస్తోంది. ఈ లక్ష్యంలో భాగంగా, అమెరికాలోని వాషింగ్టన్ డీసీ మహానగరంలో ఆగస్టు 30, 31 తేదీలలో తొలి “గ్లోబల్ మున్నూరుకాపు మహాసభను” నిర్వహించబోతోంది. ప్రపంచ యవనికపై మున్నూరుకాపుల గొప్పతనాన్ని చాటేలా ఈ మహాసభను విజయవంతం చేయడానికి జీఎంఏ శ్రమిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న మున్నూరుకాపులను ఈ మహాసభకు ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలోని ఖమ్మం, మెదక్ నుండి ఆదిలాబాద్ వరకు పలు సభలు, సమావేశాలు నిర్వహించింది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, డాక్టర్లు, నటులు, కవులు, కళాకారులను ఏకం చేసి, ఈ గ్లోబల్ మున్నూరుకాపు మహాసభను విజయవంతం చేయాలని కోరుతోంది.

“రండీ… మేము కాపులం… మున్నూరు కాపులం!” అంటూ మహాసభను విజయవంతం చేసి, మున్నూరుకాపుల ఐక్యతను చాటాలని పిలుపునిస్తోంది.

The goal is unity across seven continents. "One goal... one purpose:"Global Munnurukapu Mahasabha"
The goal is unity across seven continents. “One goal… one purpose:”Global Munnurukapu Mahasabha”

మున్నూరుకాపు సామాజిక సామరస్యానికి ఈ మహాసభలు దిక్సూచి

— వద్ది
రాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యులు

గ్లోబల్ స్థాయిలో మున్నూరుకాపు మహాసభలు నిర్వహించడం ఎంతో గర్వకారణం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మున్నూరుకాపు కుటుంబాలను ఒకే వేదికపైకి తేచ్చే
మహాసభలు, మేమంతా ఏకతాటిపై ఉన్నామని ప్రపంచానికి చాటి చెబుతాయి.ఇప్పటి వరకూ మున్నూరుకాపులైన యువతకు సరైన దిక్సూచి లేక, కొన్ని అవకాశాలు అందకుండా పోయాయి. కానీ ఇప్పుడు గ్లోబల్ నెట్‌వర్క్‌ రూపంలో మనందరం కలసి ఉన్నాం. విద్య, ఉపాధి, వ్యాపార, రాజకీయ రంగాల్లో మున్నూరుకాపుల ఎదుగుదలకు ఇది ఎంతో మేలు చేస్తుంది.ప్రభుత్వాల్లో మనకు న్యాయమైన ప్రాతినిధ్యం లభించేలా, సామాజిక న్యాయం అమలయ్యేలా కలిసికట్టుగా పని చేయాల్సిన సమయం ఇది.

The goal is unity across seven continents. "One goal... one purpose:"Global Munnurukapu Mahasabha"
The goal is unity across seven continents. “One goal… one purpose:”Global Munnurukapu Mahasabha”

తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉంది. మున్నూరుకాపు వర్గానికి కూడా సముచిత గుర్తింపు రావాలి, వారిని సామాజికంగా, ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాల్లో నేను ప్రథమంగా నిలుస్తాను. సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం, అభివృద్ధి అనేవి ఈ సభల ద్వారా అందరికీ లభించాలి.

ఈ గ్లోబల్ మహాసభలను విజయవంతంగా నిర్వహిస్తున్న సంఘ నాయకులకు, స్వచ్ఛంద సంస్థలకు, యువతకు, సీనియర్ నాయకులకు నా శుభాకాంక్షలు. మన ఐక్యతే మన బలం – ఈ బలాన్ని ప్రపంచానికి చాటాల్సిన సమయం ఇది.”

– ఆది శ్రీనివాస్
ప్రభుత్వ విప్, తెలంగాణ రాష్ట్ర శాసనసభ

గ్లోబల్ మున్నూరుకాపు మహాసభ – సామాజిక ఐక్యతకు నిదర్శనం
— బండి సంజయ్ కుమార్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

“గ్లోబల్ మున్నూరుకాపు మహాసభ అనేది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మున్నూరుకాపు బంధువుల ఐక్యతకు, అస్మితకు, అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తోంది. ఈ మహాసభ ద్వారా మున్నూరుకాపు సామాజికవర్గం తన శక్తిని, సామర్థ్యాన్ని, విశ్వవ్యాప్తిని ప్రపంచానికి తెలియజేయడం ఎంతో గర్వకారణం.నేడు విద్య, వైద్యం, ఉపాధి, రాజకీయాల్లో మున్నూరుకాపు వర్గం ఎంతో ముందుకు వెళ్తోంది. అయితే సామూహిక చైతన్యం ద్వారా మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. ఈ మహాసభల ద్వారా యువతలో ఓ కొత్త ఆత్మవిశ్వాసం, నూతన దారిదీపికా చిగురించాలి.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రతి వర్గ అభ్యున్నతికి కేంద్రం కట్టుబడి ఉంది. మున్నూరుకాపుల అభివృద్ధికోసం, వారి సమస్యల పరిష్కారానికి నేను వ్యక్తిగతంగా సిద్ధంగా ఉన్నాను. ఈ మహాసభల ద్వారా వచ్చిన తీర్మానాలను ప్రభుత్వానికి తీసుకెళ్లే బాధ్యతను నేను నెరవేర్చుతాను.
సామాజిక సమరసత, విద్యాభివృద్ధి, ఆర్థిక పురోగతి కోసం మున్నూరుకాపు సంఘాలు చేపట్టిన ఈ మహాసభ ఒక చారిత్రక మైలురాయి.

The goal is unity across seven continents. "One goal... one purpose:"Global Munnurukapu Mahasabha"
The goal is unity across seven continents. “One goal… one purpose:”Global Munnurukapu Mahasabha”
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్