Thursday, March 5, 2026

జర్నలిస్టులపై సీఎం చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం:-ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్

- Advertisement -

జర్నలిస్టులపై సీఎం చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం* –

జర్నలిస్టులపై సీఎం వ్యాఖ్యలు సరైనవి కావు!

-సీఎం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని జర్నలిస్టుల క్షమాపణ చెప్పాలి!

-ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ డిమాండ్!

04/08/2025:

Madasi Suresh, District Chairman of the JAC of Public Associations

హనుమకొండ జర్నలిస్టులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ప్రజాసంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ అన్నారు.సోమవారం హనుమకొండలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల మద్దతుతోనే గద్దెనెక్కిన సీఎం అక్షరం ముక్క రానోడు జర్నలిస్టుగా చాలామంది అవుతున్నాడని కించపరచడం సరైనది కాదని వెంటనే ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ బద్ధమైన సీఎం పదవిలో ఉండి పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా మాట్లాడడం గర్హనీయమని పేర్కొన్నారు. సీఎం వెంటనే జర్నలిస్టులకు వెంటనే క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది కలకోటి మహేందర్, అంబేద్కర్ సంఘం జిల్లా నాయకుడు మోరే ఐలయ్య తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్