Monday, February 23, 2026

కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్?

- Advertisement -

కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్?

హైదరాబాద్:ఆగస్టు 23

Congress MLA arrested?

ఆన్లైన్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నాడన్న ఆరోపణలతో కర్ణాటక ఎమ్మెల్యే కెసి వీరేంద్ర ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. శనివారం సిక్కిం లోని గ్యాంగ్ టక్ లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.ఎమ్మెల్యే తో పాటు ఆయన అనుచరుల ను కూడా ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

వీరేంద్రకు చెందిన అనేక ప్రదేశాలపై ఈడీ దాడులు చేసి దాడుల్లో రూ.12 కోట్లకు పైగా నగదు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ఒక కోటి కంటే ఎక్కువ విదేశీ కరెన్సీని సైతం స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ ఆగస్టు 22- 23 తేదీలలో దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఆపరేషన్‌ చేపట్టింది.

అక్రమ బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్ రాకెట్‌ను ఛేదించిం ది. ఈ కేసు కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా ఎమ్మెల్యే కెసి వీరేంద్ర, అతని సన్నిహి తులకు సంబంధించినది. గ్యాంగ్‌టక్, చిత్రదుర్గ, బెంగళూరు, హుబ్లి, జోధ్‌పూర్, ముంబై, గోవా సహా 31 ప్రదేశాలలో ఈడీ బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. గోవాలో కూడా పప్పీస్ క్యాసినో గోల్డ్, ఓషన్ రివర్స్ క్యాసినో, పప్పీస్ క్యాసినో ప్రైడ్, ఓషన్ 7 క్యాసినో, బిగ్ డాడీ క్యాసినో అనే ఐదు పెద్ద క్యాసినోలలో ఈడీ సోదాలు నిర్వహించింది.

ఈ దాడిలో ఈడీ దాదాపు రూ.12 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. అందులో రూ.1 కోటి విదేశీ కరెన్సీ, రూ.6 కోట్ల విలువైన బంగారం, 10 కిలోల వెండి, నాలుగు లగ్జరీ కార్లు ఉన్నాయి.వీటితో పాటు, 17 బ్యాంకు ఖాతాలు, 2 లాకర్లను సీజ్ చేసింది.

ఎమ్మెల్యే వీరేంద్ర కింగ్567, రాజా567 వంటి అనేక ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్‌లను నడుపుతున్నాడని దర్యాప్తులో తేలింది. అతని సోదరుడు కె.సి. తిప్పస్వా మి దుబాయ్ నుంచి డైమండ్ సాఫ్టెక్, టిఆర్ఎస్ టెక్నాలజీస్, ప్రైమ్ 9 టెక్నాలజీస్ అనే మూడు కంపెనీల ద్వారా ఈ వ్యాపా రాన్ని నిర్వహిస్తున్నాడు.

మరో సోదరుడు కె.సి. నాగరాజ్, అతని కుమారుడు పృథ్వీ ఎన్. రాజ్ కూడా ఈ పనిలో పాలుపంచుకున్నట్లు చెబుతున్నారు. ఈ దాడుల సమయంలో ఈడీ అనేక ముఖ్యమైన పత్రాలు, ఆధా రాలను కూడా కనుగొంది. అక్రమ ఆదాయాన్ని వేర్వేరు విధానాల ద్వారా వైట్ మనీగా చూపించడా నికి ప్రయత్నాలు జరుగుతు న్నాయని స్పష్టమైంది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్