Thursday, March 12, 2026

విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ ‘భద్రకాళి’ నుంచి పవర్ ఫుల్ సాంగ్ జిల్ జిల్ రిలీజ్  

- Advertisement -

విజయ్ ఆంటోనీ, అరుణ్ ప్రభు, రామాంజనేయులు జవ్వాజీ, సర్వంత్ రామ్ క్రియేషన్స్, విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ ‘భద్రకాళి’ నుంచి పవర్ ఫుల్ సాంగ్ జిల్ జిల్ రిలీజ్  

Vijay Antony Film Corporation releases powerful song Jil Jil from 'Bhadrakali'

తెలుగు ప్రేక్షకులను అలరించిన ‘మార్గన్’ విజయం తర్వాత విజయ్ ఆంటోనీ మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌తో ‘భద్రకాళి’ వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్,  మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
మేకర్స్ తాజాగా జిల్ జిల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. విజయ్ ఆంటోని పవర్ ఫుల్ సాంగ్ గా కంపోజ్ చేశారు. భోలే షావలి స్వయంగా రాసి పాడిన ఈ సాంగ్ హై ఎనర్జీతో ఆకట్టుకుంది. సాంగ్ లోని పవర్ ప్యాక్డ్ విజువల్స్ సినిమాపై చాలా క్యురియాసిటీ పెంచాయి.
తెలుగులో మార్గన్ సినిమాను విజయం దిశగా నడిపించిన ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేస్తుంది. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సపోర్ట్ కూడా ఉండడంతో ప్రాజెక్ట్‌పై మంచి బజ్ ఉంది.
ఈ సినిమాలో వాగై చంద్రశేఖర్, సునీల్ కృష్ణపాని, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, కిరణ్, రినీ బాట్, రియా జితు, మాస్టర్ కేశవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తున్నారు. షెల్లీ కాలిస్ట్ డీవోపీ, విజయ్ ఆంటోనీ స్వయంగా మ్యూజిక్ అందిస్తున్నారు. రేమండ్ డెరిక్ ఎడిటర్. రాజశేఖర్ ఫైట్ మాస్టర్.  శ్రీరమన్ ఆర్ట్ డైరెక్టర్. తెలుగులో డైలాగ్స్‌ని రాజశేఖర్ రెడ్డి రాశారు.  ‘భద్రకాళి’ సెప్టెంబర్ 19న రిలీజ్  కానుంది.
నటీనటులు: విజయ్ ఆంటోని, వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, కిరణ్, రినీ బోట్, రియా జిత్తు, మాస్టర్ కేశవ్

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్