ఎంపీ వద్దిరాజు రవిచంద్ర క్యాంపు కార్యాలయంలో ఘనంగా ప్రజాకవి కాళోజి జయంతి వేడుకలు

- Advertisement -

ఎంపీ వద్దిరాజు రవిచంద్ర క్యాంపు కార్యాలయంలో ఘనంగా ప్రజాకవి కాళోజి జయంతి వేడుకలు

Celebrations of Prajakavi Kaloji's birth anniversary at MP Vaddiraju Ravichandra's camp office
Celebrations of Prajakavi Kaloji's birth anniversary at MP Vaddiraju Ravichandra's camp office
Celebrations of Prajakavi Kaloji’s birth anniversary at MP Vaddiraju Ravichandra’s camp office

కాళోజి కి పలువురి ఘన నివాళులు…

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కాళోజీ అని కీర్తించిన ప్రముఖులు…

ఖమ్మం, సెప్టెంబర్ 09

పుట్టుక నీది, చావు నీది బతుకంతా దేశానిది అని తెలంగాణ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో తన కలం ద్వారా కోట్ల మందిని ఐక్యం చేసిన ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు, పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ 9న ఎంపీ వద్దిరాజు రవిచంద్ర క్యాంపు కార్యాలయం ఖమ్మంలో మహాకవి కాలోజి నారాయణరావుకు ఘనంగా నివాళులర్పించారు. ఖమ్మం నగర మాజీ కార్పొరేటర్ శీలంశెట్టి వీరభద్రం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి… కార్పొరేటర్లు, పలువురు మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు బిఆర్ఎస్, బిజెపి, సహా ఇతర పార్టీలకు, వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలేజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కాళోజీ అని, ఆయన కవిత్వం కేవలం సాహిత్యమే కాకుండా సామాజిక మార్పుకు మార్గం చూపిన శక్తివంతమైన ఆయుధమని అన్నారు. పేదల వేదన, ప్రజల ఆశలు, సామాజిక అన్యాయాలను ప్రతిబింబించేలా ఆయన రచనలు నేటికీ తరతరాలకు ప్రేరణనిస్తు న్నాయని వారు గుర్తుచేశారు. స్వాతంత్య్ర సమరంలో కీలక పాత్ర పోషించి, ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన ప్రజాకవి కాళోజీ అని వారు అన్నారు. సాదాసీదా జీవనం గడిపి, తన ఆలోచనలతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడని వారు అన్నారు. నాడు తెలంగాణ తొలి ముఖ్య మంత్రి కేసీఆర్ పాలనలో కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించడం గర్వకారణమని వారు గుర్తు చేశారు. కాళోజీ కలలు, ఆకాంక్షలు సాకారం చేసే దిశగా మనమందరం ముందుకు సాగాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ, బిఆర్ఎస్ ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్ తోట రామారావు, ఖమ్మం నగర కార్పొరేటర్ బుడిగం శ్రీనివాసరావు
బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు ఎండి పాషా, తెలంగాణ ఉద్యమకారులు పగడాల నరేందర్, బీఆర్ఎస్ డివిజన్ మహిళ అధ్యక్షురాలు బత్తుల వసంత, రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్నాటి సోమయ్య, వద్దిరాజు యువసేన నాయకులు సుంకర చిరంజీవి, నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా నాయకులు రామనాథం, పి శరత్, వసంత లక్ష్మి, కే పద్మ, చీర్ల కోటేశ్వరరావు, గొట్టం శ్రీనివాసరావు, బిజెపి ఖమ్మం టౌన్ నాయకులు దాసరి మధు, వడ్డెర సంఘం జిల్లా నాయకులు బత్తుల వెంకన్న, చల్లా గాంధీ, ప్రవీణ్, వైకే బాబు, అశోక్, టీ యూ డబ్ల్యూ జె (టీ జె ఎఫ్) ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు వనం నాగయ్య, వీడియో జర్నలిస్ట్ జానపాటి ఈశ్వర ప్రసాద్, రిపోర్టర్ పిన్ని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular