Wednesday, March 11, 2026

నేటి నుండి ఆసియా కప్ సంబరాలు!

- Advertisement -

నేటి నుండి ఆసియా కప్ సంబరాలు!

హైదరాబాద్ :సెప్టెంబర్ 09

Asia Cup celebrations start today!

ఆసి­యా కప్ 2025 టో­ర్నీ­ నేటి నుండి షురూ…. మం­గ­ళ­వా­రం నుం­చి ఆసియా కప్ సంబరాలు మొదలుకానున్నాయి, 8 జట్లు 20 రో­జుల పాటు అల­రిం­చ­డా­ని­కి సి­ద్ధం­గా ఉన్నాయి ఈ కాం­టి­నెం­ట­ల్ టో­ర్నీ­లో టీ­మిం­డి­యా ఫే­వ­రే­ట్ గా బరి­లో­కి ది­గు­తోం­ది. పా­కి­స్థా­న్, ఆఫ్ఘ­ని­స్తా­న్, శ్రీ­లంక, బం­గ్లా­దే­శ్ గట్టి పోటీ ఇవ్వ­డా­ని­కి సి­ద్ధం­గా ఉన్నా­యి.

యూఏఈ, హాం­గ్ కాం­గ్, ఒమ­న్‌­‌­‌­‌­‌­‌­‌‌ సం­చ­ల­నా­లు సృ­ష్టిం­చేం­దు­కు సై అం­టు­న్నా­యి. తొ­లి­సా­రి ఆసి­యా కప్ లో 8 జట్లు ఆడు­తుం­డ­డం­తో ఈ టో­ర్నీ ఆస­క్తి­గా మా­రిం­ది. ఇప్ప­టి­కే ప్లే­య­ర్లం­తా సి­ద్ధం. ఎని­మి­ది జట్లు తల­ప­డే ఈ టో­ర్నీ­లో ప్ర­తి క్రి­కె­ట­రూ కీ­ల­క­మే. దుబాయ్‌‌‌‌‌‌‌‌, అబుదాబి వేదికలుగా ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా 19 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు జరుగుతాయి. టోర్నీ ప్రారంభ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ జట్ల మధ్య జరగనుంది.

అద్భుతాలు సాధ్యమే ఆసి­యా కప్ 2025 సె­ప్టెం­బ­ర్ 9న రా­త్రి 8 గం­ట­ల­కు మొ­ద­ల­వు­తు­ది. టో­ర్న­మెం­ట్ దు­బా­య్‌­లో జరు­గు­తుం­ది. ఫై­న­ల్ కూ డా ఇక్క­డే జరు­గు­తుం­ది. ఆసి­యా కప్ అంటే కే­వ­లం క్రి­కె­ట్ మా­త్ర­మే కాదు. ఆసి­యా దే­శాల మధ్య ఒక ఉత్కం­ఠ­ భ­రి­త­మైన పోటీ అని చె­ప్ప­ వ­చ్చు. శ్రీ­లంక, బం­గ్లా­దే­శ్, ఆఫ్ఘ­ని­స్తా­న్ లాం­టి జట్లు సర్‌­ప్రై­జ్‌­లు ఇస్తుం­టా­యి. ఒమన్, యూఏఈ, హాం­కాం­గ్ లాం­టి జట్లు ఈ సారి ఏదై­నా అద్భు­తం చే­స్తా­యే­మో చూ­డా­లి మరి…

ఈసా­రి ఆసి­యా కప్‌­ను టీ20 వర­ల్డ్ కప్‌­ను దృ­ష్టి­లో పె­ట్టు­కు­ని ప్లా­న్ చే­శా­రు. ఎం­దు­కం­టే 2025 అక్టో­బ­ర్‌­లో భా­ర­త్, శ్రీ­లంక సం­యు­క్తం­గా టీ20 వర­ల్డ్ కప్ ని­ర్వ­హిం­చ­బో­తు­న్నా­ యి. దీం­తో అన్ని ఆసి­యా జట్లు తమ బల­హీ­న­త­ల్ని తె­లు­సు­కు­నే మంచి ఛా­న్స్‌­గా ఈ టో­ర్నీ­ని భా­వి­స్తు­న్నా­యి.

ఈ సారి టో­ర్న­మెం­ట్ మళ్లీ T20 ఫా­ర్మా­ట్‌­లో జర­గ­నుం­ది. అది కూడా 2026లో భా­ర­త్, శ్రీ­లం­క­ల్లో జరి­గే ICC T20 వర­ల్డ్ కప్‌­కి సన్నా­హ­కం­గా. గతం­లో 2022లో శ్రీ­లంక ఆసి­యా కప్‌­ని గె­ల్చు­కుం­ది. దు­బా­య్‌­లో జరి­గిన ఫై­న­ల్‌­లో పా­కి­స్తా­న్ జట్టు­ను ఓడిం­చిం­ది. 2023లో జరి­గిన గత ఎడి­ష­న్‌­‌­‌­‌­‌­‌­‌­‌­లో రో­హి­త్ శర్మ కె­ప్టె­న్సీ­లో టై­టి­ల్ నె­గ్గిన ఇం­డి­యా డి­ఫెం­డిం­గ్ చాం­పి­య­న్‌­‌­‌­‌­‌­‌­‌­‌­గా బరి­లో­కి ది­గ­నుం­ది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్