Monday, February 23, 2026

ఎంపీ వద్దిరాజుకు వినతిపత్రం అందజేసిన బీఆర్ఎస్ నాయకుడు గోవాడ,బీఆర్ఎస్వీ నాయకుడు జూపెళ్లి

- Advertisement -

ఎంపీ వద్దిరాజుకు వినతిపత్రం అందజేసిన బీఆర్ఎస్ నాయకుడు గోవాడ,బీఆర్ఎస్వీ నాయకుడు జూపెళ్లి

వాయిస్ టుడే : జూబిలీహిల్స్

BRS leader Gowada and BRSV leader Jupelli submitted a petition to MP Vaddiraju.

దినదినాభివృద్ధి చెందుతున్న కొత్తగూడెం (భద్రాచలం రోడ్డు) జిల్లా కేంద్రానికి స్పీడ్ ట్రైయిన్ వేయించాల్సిందిగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రకు బీఆర్ఎస్ నాయకుడు గోవాడ గుణ చరిత్,బీఆర్ఎస్వీ నాయకుడు జూపెళ్లి దుర్గాప్రసాద్ లు విజ్ఞప్తి చేశారు.కొత్తగూడెం నుండి ఉదయం సికింద్రాబాద్ వెళ్లే కాకతీయ రైలులో స్లీపర్ కోచ్ సౌకర్యం లేక వృద్ధులు,వికలాంగులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వారు ఎంపీ రవిచంద్ర దృష్టికి తెచ్చారు.ఈ మేరకు వారు ఎంపీ రవిచంద్రను మంగళవారం బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. సింగరేణి కార్మికులు,ఉద్యోగులు,వ్యాపారస్తులు, భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం సికింద్రాబాద్ నుంచి కొత్తగూడెంకు స్పీడ్ ట్రైన్ వేయించాల్సిందిగా, కాకతీయ ఎక్స్ ప్రెస్ రైలులో కోచ్ లు ఏర్పాటు చేయించాల్సిందిగా వారు ఎంపీ రవిచంద్రను కోరారు.ఎంపీ వద్దిరాజు వినతిపత్రాన్ని పరిశీలించి స్పందిస్తూ రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా పరిష్కరిస్తానని గుణచరిత్, దుర్గాప్రసాద్ లకు హామీనిచ్చారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్