Monday, February 23, 2026

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తాం మంత్రులు పొన్నం, తుమ్మల

- Advertisement -

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తాం
మంత్రులు పొన్నం, తుమ్మల
హైదరాబాద్

We will hoist the Congress party flag in the Jubilee Hills by-election too
Ministers Ponnam, Tummala

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్ గూడా  డివిజన్ లోని సర్కిల్ 19 లో  5.55 కోట్ల రూపాయలు వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు  పొన్నం ప్రభాకర్ ,తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు.

యూసుఫ్ గూడా డివిజన్ లోని నవోదయ కాలని లో  7 పనులకు 178.35 లక్షల రూపాయల వ్యయంతో (నవోదయ కాలని ,మారుతి నగర్, కమలాపురి కాలని ,ఇంజనీర్స్ కాలని )  సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు.

శంకుస్థాపన చేసుకున్న సీసీ రోడ్ల పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
తరువాత  యూసుఫ్ గూడా డివిజన్ లోని లేబర్ అడ్డా రోడ్డు లో 14 పనులకు  377.35 లక్షల రూపాయల వ్యయంతో ( LN నగర్, యూసుఫ్ గూడా బస్తీ , శ్రీ కృష్ణ నగర్ , హైలం కాలని )  సీసీ రోడ్లకు శంకుస్థాపన

చేశారు లేబర్ అడ్డా లో  కూలీలలో జీహెచ్ ఎంసీ శానిటేషన్ సిబ్బందితో ముచ్చటించారు.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ప్రజా పాలన ప్రభుత్వంలో వారి సమస్యలు పరిష్కారం చేస్తున్నామని నూతన రేషన్ కార్డులు ఇచ్చామని,సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని వారికి తెలిపారు..  ఈ  కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయ లక్ష్మీ,

రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, సాట్ చైర్మన్ శివసేన రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, సిఎన్ రెడ్డి, అజారుద్దీన్ , నవీన్ యాదవ్ ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గోన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్  మాట్లాడుతూ యూసుఫ్ గూడా డివిజన్ లో 5.55 కోట్ల రూపాయల తో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసుకున్నాం. ఈ ప్రాంతంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. జూబ్లీహిల్స్

నియోజకవర్గంలో అనివార్య కారణాల వల్ల ఉప ఎన్నిక వచ్చింది.. ఇది ఉప ఎన్నికల కోసం కాదు. కృష్ణ నగర్ లో చాలా కాలంగా పెండింగ్ లో డ్రైనేజీ పనులు మొన్న శంకుస్థాపన చేసుకున్నాం ఇక నుండి వర్షం

కురిసినపుడు ఇక్కడ ఇబ్బందులు ఉండవు. ఇటీవల కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిచాం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామన్నారు.
మంత్రి తుమ్మల మాట్లాడుతూ   జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో యూసుఫ్ గూడా డివిజన్ లో ఈరోజు 5.55 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నాం. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరం గా

అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నాయకత్వంలో కేబినెట్ పనిచేస్తుంది.. మీరు మరింత మద్దతు ఇవ్వండి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపు 90 కోట్ల కు పైగా అభివృద్ధి

కార్యక్రమాలు చేపట్టాం.. జూబ్లీహిల్స్ ఒకటే కాదు హైదరాబాద్ మొత్తం సమస్యలు పరిష్కారం చేస్తున్నాం . మీకు ఏ పనులు కావాలన్నా అడగండి.. సంక్షన్ అయిన పనులు వేగంగా పూర్తి చేయాలి.డ్రైనేజీ,రోడ్లు ఇతర

పనులు పది కాలాల పాటు మన్నిక ఉండేలా పనులు పూర్తి చేయాలి. మీ సమస్యలు స్థానిక నాయకుల దృష్టికి తీసుకురండి.. మీ సమస్యల పరిష్కారం చేసే బాధ్యత మాదని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్