- Advertisement -
కర్ర శ్రీహరి మృతి పట్ల వద్దిరాజు సంతాపం
Rajya Sabha member Vaddiraju Ravichandra condoles the death of Karra Srihari
నాలుగు దశాబ్దాలపాటు సర్పంచ్, పాక్స్ చైర్మన్, ఎంపీపీ, జడ్పీటీసీగా ఎన్నో పదవుల్లో ప్రజాసేవ చేస్తూ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన, పారదర్శకతకు ప్రతీకగా నిలిచిన బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి మరణం పట్ల రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర విచారం వ్యక్తం చేశారు.నిజాయితీ, నిబద్ధత కలిగిన ఆయన మృతి బీఆర్ఎస్ కు, హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని చెప్పారు.
ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని వద్దిరాజు అన్నారు.
నిజాయితీ, అంకితభావం, నిస్వార్థ సేవలతో ప్రజల గుండెల్లో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించుకున్న నాయకుడిగా కర్ర శ్రీహరి ఎప్పటికీ నిలిచిపోతారని ఆయన అభిప్రాయపడ్డారు.
హుస్నాబాద్ నియోజకవర్గానికి ఆయన మృతి తీరని లోటు అని రవిచంద్ర

అన్నారు.
కర్ర శ్రీహరి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు.
- Advertisement -


