కుటుంబ సభ్యలతో శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ వద్దిరాజు

- Advertisement -

కుటుంబ సభ్యలతో శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ వద్దిరాజు

MP Vaddiraju visits Srivarani with family members
MP Vaddiraju visits Srivarani with family members
MP Vaddiraju visits Srivarani with family members

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన ధర్మపత్ని విజయలక్ష్మీతో కలిసి తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.ఎంపీ రవిచంద్ర-విజయలక్మీ పుణ్య దంపతులు సోమవారం తెల్లవారుజామున కలియుగ ఇష్టదైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు చేశారు.వేద పండితులు,ఆలయ అధికారులు ఎంపీ రవిచంద్ర-విజయలక్మీ దంపతులకు స్వాగతం పలికి శాలువాతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఎంపీ రవిచంద్ర-విజయలక్మీలతో పాటుగా వారి కూతురు డాక్టర్ గంగుల గంగాభవాని,మనవళ్లు సనవ్,సౌరవ్, సన్నిహితులు మరికల్ పోత సుధీర్ కుమార్-సమంత, వారి కూతురు, తదితరులు శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తమ గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు చేశారు.
కేసీఆర్ నిండూ నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలి: ఎంపీ రవిచంద్ర
తెలంగాణ రాష్ట్రం,ప్రజలు పాడి పంటలతో సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని, తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆయురారోగ్యాలతో నిండూ నూరేళ్లు ప్రజా జీవితంలో వర్థిల్లాలని ఎంపీ రవిచంద్ర శ్రీవెంకటేశ్వర స్వామిని వేడుకున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular