బాలకృష్ణ తో డ్యామేజ్..
చిరంజీవితో చంద్రబాబు భేటీ!
హైదరాబాద్, సెప్టెంబర్ 29, (వాయిస్ టుడే )
Damage to Balakrishna..
Chandrababu meets Chiranjeevi!
ఇటీవల ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాలతో పరిస్థితి మారింది. ముఖ్యంగా శాసనసభలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో కలకలం రేగింది. ఈ ఎపిసోడ్ మొత్తాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తనకు
అనుకూలంగా మార్చుకుంటుంది. ఎప్పటి వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై సినీ పరిశ్రమకు ఉన్న అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం జరుగుతోంది. మరోవైపు కుల రాజకీయాన్ని తెరపైకి తెస్తోంది. ఈ క్రమంలో ఏపీ సీఎం
చంద్రబాబు రంగంలోకి దిగారు. ఇప్పటికే ఈ ఘటనపై అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ వివాదానికి కారణమైన వ్యాఖ్యలు చేసిన బిజెపి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ స్పందించారు. తన వ్యాఖ్యలతోనే అపార్ధాలు
చోటుచేసుకున్నాయని.. వాటిని రికార్డుల నుంచి తొలగించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును కోరారు. మరోవైపు చిరంజీవితో మాట్లాడేందుకు కొందరు ప్రముఖులు సైతం రంగంలోకి దిగినట్లు ప్రచారం జరిగింది.
ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఏపీ సీఎం చంద్రబాబు మెగాస్టార్ చిరంజీవితో సమావేశం అవుతారని తెలుస్తోంది.సాధారణంగా నందమూరి బాలకృష్ణ అసెంబ్లీకి హాజరు కారు. చాలా అరుదుగా వస్తారు. అటువంటిది
వచ్చి రాగానే ఈ అంశం పై మాట్లాడుతూ రచ్చ చేశారు. అయితే వాస్తవానికి నందమూరి బాలకృష్ణ స్పందనలో తప్పులేదు. కానీ చిరంజీవి ప్రస్తావన తీసుకొచ్చి.. అప్పట్లో ఎవరూ గట్టిగా అడగలేదని అనేసరికి చిరంజీవి
స్పందించాల్సి వచ్చింది. తన కోరిక మేరకు మాత్రమే అప్పట్లో టిక్కెట్ ధరల పెంపునకు వైసీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని మాత్రమే చెప్పారు. అయితే అది మొదలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. అప్పట్లో చిరంజీవి
విషయంలో జగన్మోహన్ రెడ్డి సోదర భావంతో మెలిగేవారని.. సినీ పరిశ్రమకు చాలా రకాల సహాయం చేశారని ప్రచారం చేయడం ప్రారంభించింది. అదే సమయంలో కూటమి పార్టీలో కీలక భాగస్వామిగా ఉన్న డిప్యూటీ
సీఎం పవన్ కళ్యాణ్ పూర్తి ఇరకాటంలో పడ్డారు. ఇటువంటి విషయాల్లో దూకుడుగా స్పందించే ఎమ్మెల్సీ నాగబాబు సైతం సైలెంట్ అయ్యారు. అయితే ఈ మొత్తం పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందుకే చంద్రబాబు రంగంలోకి దిగనున్నారు. నేరుగా మెగాస్టార్ చిరంజీవితో సమావేశం అయి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టనున్నారు.కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా
సార్లు చంద్రబాబును కలిశారు చిరంజీవి. వివిధ వేదికల వద్ద కలిసినప్పుడు ఈ ఇద్దరూ పరస్పరం గౌరవించుకున్నారు. చిరంజీవిని చంద్రబాబు ఎక్కువగా అభిమానించారు. అదే సమయంలో చిరంజీవి సైతం చంద్రబాబును
చాలా గౌరవభావంతో చూసేవారు. మరోవైపు తన సోదరుడు పవన్ కళ్యాణ్ కూటమిలో కీలక భాగస్వామి కావడంతో చిరంజీవి సైతం చాలా బాధ్యతగా మెలిగేవారు. అందుకే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.
అయితే ప్రస్తుతం ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా ఉన్నారు చిరంజీవి. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో నిత్యం మాట్లాడుతూ ఉండేవారు. పరిశ్రమలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నడుచుకునేవారు. ఈ క్రమంలోనే
చిన్న చిన్న తప్పిదాలు జరిగాయి. అయితే పరిశ్రమ కోణంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడారు. కానీ ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా కూటమికి డ్యామేజ్ చేస్తున్నాయి. అందుకే దిద్దుబాటు చర్యల్లో భాగంగా
చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగుతారని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో సమావేశంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలతో..
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సినీ పరిశ్రమను సైతం ఇబ్బంది పెట్టిందని సభలో వ్యాఖ్యానించారు కామినేని శ్రీనివాస్. అప్పట్లో టిక్కెట్ ధర పెంపు అనేది మెగాస్టార్ చిరంజీవి గట్టిగానే అడిగితేనే జగన్ ఒప్పుకున్నట్లు
కామినేని ప్రకటించారు. దానికి కౌంటర్ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ. అప్పట్లో జరిగింది ఇది అంటూ చెప్పే క్రమంలో.. చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ స్పందించారనేది తప్పు అని.. అప్పట్లో ఎవరు గట్టిగా అడగలేదని..
పైగా చిరంజీవికి అవమానం జరిగిందని చెప్పుకొచ్చారు బాలకృష్ణ. అయితే తన పేరు ప్రస్తావనకు తీసుకురావడంతో చిరంజీవి విదేశాల నుంచి స్పందించారు. నాడు ఏం జరిగింది అనే దానిపై ప్రకటనలో పేర్కొన్నారు.
అప్పట్లో సినీ ప్రముఖుల విన్నపం మేరకు మాత్రమే తాను జగన్మోహన్ రెడ్డిని అందరినీ తీసుకెళ్లి కలిశానని.. దాని ఫలితమే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి సినిమాలకు టిక్కెట్ల ధర పెంపు అనుమతి అంటూ
చెబుతూ ముగించారు.అప్పటినుంచి వివాదం చినికి చినికి గాలి వానలా మారి.. చిరంజీవికి బాలకృష్ణ క్షమాపణ చెప్పాలన్న స్థితికి చేరుకుంది. అయితే దీనిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార అస్త్రంగా మార్చుకుంది.
అప్పట్లో సినీ పరిశ్రమకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డిని చెప్పుకొచ్చారని.. ఆ ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని.. ఇదంతా టీడీపీ కూటమి పని అని తేల్చి చెప్పే ప్రయత్నం చేసింది. చిరంజీవిని టార్గెట్ చేసుకున్న
బాలకృష్ణ క్షమాపణ చెప్పాల్సిందేనని చెప్పింది. చిరంజీవి పట్ల జగన్మోహన్ రెడ్డి తన అభిమానాన్ని చాటుకుంటూ వచ్చారని గుర్తుచేసింది. తద్వారా కూటమిలో విచ్ఛిన్నం తేవాలని చూసింది. సామాజిక రంగు కూడా
దీనికి పులుముకుంది. దీంతో సీఎం చంద్రబాబు సైతం అసహనం వ్యక్తం చేసినట్లు ప్రచారం నడిచింది. అయితే ఇంతటి వివాదానికి కారణమైన కామినేని శ్రీనివాస్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు.. అపార్థాలకు
కారణమైన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను రికార్డుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేయడం విశేషం. దీంతో ఈ వివాదానికి కొంతవరకు ఎండ్ కార్డు పడినట్టే.



