Thursday, March 12, 2026

శివాజీ నిర్మాతగా శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ‘ఉత్తర’ ఫస్ట్ లుక్

- Advertisement -

దసరా సందర్భంగా శివాజీ నిర్మాతగా శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్. 2గా నిర్మిస్తున్న ప్రాజెక్ట్ నుంచి నటి లయ పోషించిన ‘ఉత్తర’ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల*
First look of ‘Utthara’ under the banner of Sri Shivaji Productions as producer of Sivaji
శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నటుడు శివాజీ నిర్మాతగా తెరకెక్కిస్తున్న చిత్రంలో నటి లయ ముఖ్య పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. శివాజీ ప్రొడక్షన్ హౌస్‌లో రానున్న ఈ చిత్రానికి సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈటీవీ విన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు..దసరా సందర్భంగా అక్టోబర్ 2న ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ మూవీ నుంచి దసరా స్పెషల్‌గా నటి లయ పోషించిన పాత్రకు సంబంధించిన పరిచయాన్ని చేశారు. లయ ఈ చిత్రంలో ఉత్తర అనే గృహిణి పాత్రను పోషిస్తున్నారు. ఈ క్యారెక్టర్‌లో ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయని పోస్టర్‌ను చూస్తేనే తెలుస్తోంది. పైకి ఒకలా.. లోపల ఇంకోలా ఎమోషన్స్‌ను దాచుకునే ఈ పాత్రలో లయ చాలా కొత్తగా, డిఫరెంట్ గా కనిపించబోతోన్నారని తెలుస్తోంది.బయటకి సాధారణ మహిళగా కనిపిస్తూనే, లోపల క్రిమినల్ నేచర్ ను దాచిపెట్టుకుంటూ, డ్యూయల్ బిహేవియర్ తో  (రెండు రకాల మనస్తత్వాలతో) సాగే ఈ  పాత్రలో లయ తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నారని చిత్ర బృందం తెలిపింది.  తన కుటుంబం జోలికి వస్తే, ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధపడే వ్యక్తిగా, మల్టిపుల్ షేడ్స్ ఉన్న ఇలాంటి పాత్రలో లయ కనిపించబోతున్నారు
ఈ పోస్టర్లో లయను, ఆమె చేతిలో ఉన్న ఆయుధాలను చూస్తే, ఆమె పాత్రలో ఎన్ని షేడ్స్ ఉంటాయో అర్ధం అవుతుంది. ఇక ఈ మూవీకి మిథిల్ కుమార్, సుధీర్ శ్రీరామ్ కథను అందించారు. ఈ సినిమాకు రిత్విక్ రెడ్డి కెమెరామెన్‌గా, రంజిన్ రాజ్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు.
నటీనటులు : శివాజీ, లయ , అలీ ధనరాజ్ , ప్రిన్స్, జబర్దస్ ఇమ్మాన్యుయేల్, రాజ్ తిరందాసు , కరణ్ తదితరులు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్