BC రిజర్వేషన్ బిల్లుపై హైకోర్టులో వాదనలు ఇలా..బీసీ రిజర్వేషన్ల పై హైకోర్టు లో కీలక పరిణామాలు..!!
Arguments in the High Court on the BC Reservation Bill are as follows..
హైదరాబాద్: స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టులో వాదనలు ఆసక్తిగా సాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 9ను సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే.
వీటిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో వాదనలు ఆసక్తిగా జరుగుతున్నాయి. ప్రభుత్వం తరపున అడ్వకెట్ జనరల్, అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ఎంపీ అనిల్ యాదవ్ హైకోర్టుకు స్వయంగా హాజరయి వాదనలు విన్నారు.
* హైకోర్టు: రిజర్వేషన్ల పెంపు బిల్లు అసెంబ్లీలో ఎప్పుడు పాస్ అయ్యింది ?
* అడ్వకేట్ జనరల్: 2025, ఆగస్ట్ 31వ తేదీన ఏకగ్రీవ తీర్మానం చేసి గవర్నర్కు పంపటం జరిగింది
* హైకోర్టు: గవర్నర్ దగ్గర బీసీ రిజర్వేషన్ బిల్లు పెండింగ్లో ఉందా..?
* అడ్వకేట్ జనరల్: బీసీలకు 42 శాతం బిల్లు అసెంబ్లీలో పాస్ అయ్యింది.. గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది.
* పిటిషనర్ తరపు న్యాయవాది: బీసీ కోటా 42 శాతం ప్రభుత్వం పెంచి ఇచ్చింది (సుప్రీంకోర్టులో వాదనల అంశాన్ని ప్రస్తావించిన పిటిషనర్ తరపు లాయర్లు)
* పిటిషనర్ తరపు న్యాయవాది: ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా రిజర్వేషన్ అమలు చేస్తోంది. 50 శాతం రిజర్వేషన్లు మించకూడదని రాజ్యాంగం చెబుతోంది. అందుకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో కలిపి రిజర్వేషన్ 67 శాతానికి చేరుతుంది.
* పిటిషనర్ తరపు న్యాయవాది: షెడ్యూల్ ఏరియాల్లో షెడ్యూల్డ్ ట్రైబ్స్ కు మాత్రమే రిజర్వేషన్లు పెంచుకునే అవకాశాన్ని సుప్రీంకోర్టు కల్పించింది.
* పిటిషనర్ తరపు న్యాయవాది: స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోవాలన్న ఉద్దేశం లేదు.. చట్ట ప్రకారం రిజర్వేషన్లు ఉండాలన్నదే మా ఉద్దేశం
బీసీ రిజర్వేషన్ల అంశం పై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం గా.. అదే విధంగా అనుకూలంగా దాఖలైన పిటీషన్ల పైన విచారణ జరిగింది.
బీసీ బిల్లు అసెంబ్లీలో పాస్ అవ్వటం.. గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న అంశం ప్రస్తావనకు వచ్చింది. స్థానిక సంస్థల షెడ్యూల్ సైతం ఈ రిజర్వేషన్లతోనే నిర్వహించేలా సిద్దం అయినట్లు వివరించిన పిటీషనర్.. రిజర్వేషన్లు 50 శాతం దాటటానికి అవకాశం లేదని వాదనలు వినిపించారు. దీంతో.. హైకోర్టు ఈ వాదనల తరువాత తదుపరి విచారణ కోసం వాయిదా వేసింది.
బీసీ రిజర్వేషన్ల అంశం పై హైకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలుత ఈ కేసు లో దాఖలైన పిటీషన్ల పై కోర్టు ప్రారంభమైన వెంటనే విచారణకు స్వీకరించినా… వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రిజర్వేషన్లపై ప్రస్తుత ఏంటని న్యాయస్థానం ప్రశ్నించింది. సుప్ రీంకోర్టులో జరిగిన విచారణపైనా హైకోర్టు ధర్మాసనం ఆరా తీసింది. అన్ని పిటిషన్లను కలిపి ఒకేసారి విచారిస్తామని పేర్కొన్న ధర్మాసనం..కాసేపటి క్రితం విచారణకు స్వీకరించింది.
కాగా, బీసీ రిజర్వేషన్లపై 28 ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇంప్లీడ్ పిటీషన్ల పైన ముందుగా వాదనలు జరిగాయి. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయిన అంశాన్ని న్యాయ వాదులు కోర్టుకు వివరించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోను కోర్టుకు నివేదించారు.
షెడ్యూల్ విడుదల అయినా.. రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదనే సుప్రీం ఆదేశాలను పిటీషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. 42 శాతం రిజర్వేషన్ల బిల్లు పాసయిందా అంటూ కోర్టు విచారణ సమయంలో ప్రశ్నించింది. అసెంబ్లీలో పాస్ అయిందని.. గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాదులు సమాధానం ఇచ్చారు. రాష్ట్రపతి ఆమోదం అవసరమా అంటూ కోర్టు ప్రశ్నించింది. రిజర్వేషన్లపై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు.
అయితే సుప్రీం మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ల పెంపు నిర్ణయం జరగలేదని పిటీషన్ తరపు లాయర్ వాదించారు. ట్రిపుల్ టెస్ట్ గురించి ప్రధానంగా తన వాదనల్లో ప్రస్తావించారు. ఈ వాదనల తరువాత హైకోర్టు తదుపరి విచారణ కోసం మధ్నాహ్నం కు వాయిదా వేసింది. దీంతో.. హైకోర్టు తీసుకునే నిర్ణయం మేరకు రిజర్వేషన్లు.. స్థానిక సంస్థల నిర్వహణ అంశం పైన స్పష్టత రానుంది.
* అడ్వకేట్ జనరల్: కుల గణన ద్వారా బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రిజర్వేషన్ పెంచటం జరిగింది. రాష్ట్రంలో బీసీల సంఖ్యకు తగ్గట్టు రిజర్వేషన్ పెంచటం జరిగింది.
* అడ్వకేట్ జనరల్: స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ ద్వారా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా న్యాయం చేయటం సాధ్యం అవుతుంది.



