విద్యార్థులకు అవగాహన సదస్సు..!
ఆర్.గోవింద రెడ్డి – మేడిపల్లి సిఐ.
వాయిస్ టుడే న్యూస్, అక్టోబర్ 14 మేడిపల్లి :
Awareness seminar for students..!
R. Govinda Reddy – Medipalli CI.

R. Govinda Reddy – Medipalli CI.
మంగళవారం రోజు ఉదయం బోడుప్పల్ లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో సుమారు 1000 మంది విద్యార్థులతో మేడిపల్లి ఇన్స్పెక్టర్ అవేర్నెస్ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మేడిపల్లి ఇన్స్పెక్టర్ విద్యార్థులకు చదువుతోపాటు సమాజంలో జరిగే మంచి, చెడుల గురించి తెలుసుకుంటు తల్లిదండ్రులను గౌరవించడంతో పాటు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని తెలియజేయడం జరిగింది. అలాగే సైబర్ నేరాల గురించి అవగాహన కల్పిస్తూ, టెక్నాలజీని ని మంచి కోసం ఉపయోగించాలి గాని చెడు కోసం ఉపయోగించొద్దు అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సైలు, కానిస్టేబుల్స్ శ్రీ చైతన్య కాలేజ్ యాజమాన్యం పాల్గొన్నారు.


