పంజాబ్ లో కేంద్ర మంత్రి బండి సంజమయ్ పర్యటన

- Advertisement -

పంజాబ్ లో కేంద్ర మంత్రి బండి సంజమయ్ పర్యటన
న్యూఢిల్లీ

Union Minister Bandi Sanjamay’s visit to Punjab
భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో కేంద్రమంత్రి బండి సంజయ్ పర్యటన
పంజాబ్ లో గురుదాస్ జిల్లాలో వరదలకు తీవ్రంగా దెబ్బతిన్న గ్రామాలను  కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సందర్శించారు. సరిహద్దు ముంపు బాధితులకు నిరంతరంగా అండగా ఉన్న బీఎస్ఎఫ్ సైనికుల ధైర్య, సాహసాలు, సేవలను  కేంద్ర మంత్రి కొనియాడారు. వారితో కలిసి ఫోటోలు దిగారు. వరద బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రావి నది వరదలతో వేలాది ఎకరాల్లో కిలోమీటర్ల మేర మేటలు వేసిన ద్రుశ్యాలను పరిశీలించారు. 2 ఏళ్లపాటు సాగుకు కూడా పనికిరావని, సర్వం కోల్పోయామని  రైతులు మొర పెట్టుక్ఉన్నారు. రాష్ట్ర మంత్రులు, అధికారులెవరూ ఇటువైపు కూడా కన్నెత్తి చూడలేదని వాపోయారు. కేంద్రమే ఆదుకోవాలని అన్నదాతలు కోరారు.
పంజాబ్ ప్రజలకు మోదీ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. అన్నదాతలెవరూ ఆందోళన చెందవద్దు. పంజాబ్ కు కేంద్ర ప్రభుత్వం రూ.1600 కోట్ల తక్షణ సాయం ప్రకటించినట్లు వెల్లడించారు. ఇవిగాక రూ.1200 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధులు రాష్ట్రం వద్దే ఉన్నాయని చెప్పారు. నిరాశ్రయులకు నెలకు సరిపడా  బియ్యం, పప్పు, మసాలా దినసులతో కూడిన ‘మోదీ కిట్ల’ను అందించారు.
ఇండ్లు కోల్పోయిన వారందరికీ పీఎం ఆవాస్ యోజన కింద ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular