Sunday, January 25, 2026

మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ షూటింగ్‌లో జాయిన్ అయిన విక్టరీ వెంకటేష్

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ షూటింగ్‌లో జాయిన్ అయిన విక్టరీ వెంకటేష్
Victory Venkatesh joins Megastar Chiranjeevi’s ‘Mana Shankaravara Prasad Garu’ shooting
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2026 సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు రానుంది. కామెడీ, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్‌ కలగలిపిన ఈ సినిమా పండగ సీజన్‌కు పర్ఫెక్ట్ ట్రీట్. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సాహు గారపాటి,  సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు.
F2’, ‘F3’ లాంటి లాఫ్ రయాట్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి, ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మరోసారి విక్టరీ వెంకటేశ్‌తో జట్టుకట్టారు. ఐకానిక్ హీరోస్ చిరంజీవి – వెంకటేశ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అభిమానులకు డబుల్ ఫెస్టివల్‌. ఈ సినిమాలో వెంకటేశ్ లెంగ్తీ, క్రూషియల్ పాత్రలో కనిపించనున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని భారీ సెట్‌లో షూటింగ్ జరుగుతోంది. వెంకటేశ్ ఈరోజు షూట్‌కి జాయిన్‌ అయ్యారు. చిరంజీవి – వెంకటేశ్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
మేకర్స్ విడుదల చేసిన వీడియోలో చిరంజీవి సంతోషంగా వెంకటేశ్‌ను వెల్‌కమ్ చెబుతుండగా, వెంకటేశ్ తన మిత్రుడైన మెగాస్టార్ ను స్నేహంగా పలకరిస్తూ కనిపించారు. సెట్‌లో పండగ వాతావరణం స్పష్టంగా తెలుస్తోంది. మన శంకరవరప్రసాద్ గారు తెలుగు సినిమాలో బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌.
ఈ చిత్రం మ్యూజిక్ జర్నీ అట్టహాసంగా ప్రారంభమైయింది. ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది.  ఈ సాంగ్ లో చిరంజీవి ప్లే ఫుల్ అవతార్‌లో నయనతారను ఆటపట్టిస్తూ స్క్రీన్ పై అద్భుతమైన కెమిస్ట్రీని షేర్ చేసుకున్నారు.
ఈ చిత్రానికి సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.  ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ సహ రచయితలు. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేస్తున్నారు.
నటీనటులు: మెగాస్టార్ చిరంజీవి, నయనతార, వీటీవీ గణేష్

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్