Friday, March 20, 2026

బిసి రిజర్వేషన్ల సాధన కోసం ఈనెల 13న రాష్ట్ర వ్యాప్తంగా బీసీల ధర్మ పోరాట దీక్షలు

- Advertisement -

బిసి రిజర్వేషన్ల సాధన కోసం ఈనెల 13న రాష్ట్ర వ్యాప్తంగా బీసీల ధర్మ పోరాట దీక్షలు
     బీసీల ధర్మ పోరాట దీక్ష పోస్టర్ ఆవిష్కరణలో జాజల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి
హైదరాబాద్ నవంబర్ 11

BCs to hold state-wide protests on 13th of this month to achieve BC reservations
బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని ఉదృతం చేయాలని బీసీ జేఏసీ ఇచ్చిన అష్టాంగ ఆందోళన కార్యక్రమాలలో భాగంగా (నవంబర్) ఈనెల 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా నియోజకవర్గ మండల కేంద్రాలలో వేలాధీ మందితో బీసీల ధర్మ పోరాట దీక్షలు చేపట్టాలని బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ శ్రేణులకు పిలుపునిచ్చారు.బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు ఈనెల 13న రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న బీసీల ధర్మ పోరాట దీక్షలను విజయవంతం చేయాలని కోరుతూ ఈరోజు హైదరాబాదులోని కాచిగూడ లో ఉన్న అభినంద్ గ్రాండ్ హోటల్ లో బీసీ జేఏసీ చీప్ ఆర్డినేటర్ గుజ్జ కృష్ణ, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి లతో కలిసి జాజుల శ్రీనివాస్ గౌడ్ పోస్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని, డిసెంబర్ ఒకటవ తేదీ నుండి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలలో బీసీ రిజర్వేషన్ల అంశంపై రాహుల్ గాంధీ ఇండియా కూటమి నేతలతో సమన్యయం చేసుకుని పార్లమెంటును స్తంభింపచేయాలని, కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేదాకా పార్లమెంటు సమావేశాలు వేదికగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం బీసీల తరపున రాజకీయ పోరాటాన్ని కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంచార జాతుల సంఘం అధ్యక్షులు ఎం వీరస్వామి, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మని మంజరి సాగర్, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏం చంద్రశేఖర్ గౌడ్, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు నందగోపాల్, విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథం, గంగిరెద్దుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిల్లాల నరసింహ, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివకుమార్,బీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మాదేశి రాజేందర్, ముదిరాజ్ ఐక్యవేదిక  కన్వీనర్ గొడుగు మల్లికార్జున్, మన బీసీ మహాసభ అధ్యక్షులు కొమ్ము శ్రీనివాస్ యాదవ్,దాసరి ఉష, తారకేశ్వరి, సమతా యాదవ్, సుజాత, ఉదయనేత, లచ్చ గౌడ్, స్వామి వివేక్ పటేల్, జ్ఞానేశ్వర్, కాచి సంఘం నేత హరి తిలక్ సింగ్, సత్యరాజ్ గౌడ్, శివమ్మ, నరసింహ చారి, సతీష్ నేత, వేణు, సాయిని యాదగిరి, వెంకటేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్