Sunday, January 25, 2026

50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో ములుగు ఎస్సై, కానిస్టేబుల్‌..!!

- Advertisement -

50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో ములుగు ఎస్సై, కానిస్టేబుల్‌..!!

ACB nabs SI, constable for accepting Rs 50,000 bribe..!!

ప్రభుత్వ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో అక్రమంగా కబ్జా చేసిన కేసులో న్యాయం చేయాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేసిన ములుగు పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై, కానిస్టేబుల్‌ ఏసీబీ వలలో చిక్కారు.

ములుగు పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై విజయ్‌కుమార్, కానిస్టేబుల్‌ రాజులు బాధితులపై ఒత్తిడి తెచ్చి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ డబుల్ బెడ్‌రూం ఇల్లుపై ఇతరులు అక్రమంగా కబ్జా చేయడంతో బాధితులు కోర్టును ఆశ్రయించగా, కోర్టు వారి పక్షాన ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల కాపీని ఎస్సై విజయ్‌కుమార్‌కు అందజేసి న్యాయం చేయమని బాధితులు కోరారు.

అయితే, ఆ ఇంటిని అప్పగించాలంటే రూ.1 లక్ష లంచం ఇవ్వాలని ఎస్సై డిమాండ్ చేశాడు. బాధితులు ఆ మొత్తం ఇవ్వలేకపోవడంతో రూ.50,000కు ఒప్పుకున్నారు. వెంటనే ఏసీబీ అధికారులను సంప్రదించారు.

ఏసీబీ ఏర్పాటు చేసిన ఉచ్చులో మంగళవారం సాయంత్రం కానిస్టేబుల్‌ రాజు బాధితుల నుంచి రూ.50,000 లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

తదుపరి విచారణ అనంతరం ఎస్సై విజయ్‌కుమార్‌, కానిస్టేబుల్‌ రాజులపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు..!!

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్