ఈ నెల 20, 21 తేదీలలో భారత రాష్ట్రపతి తిరుపతి జిల్లా పర్యటన
President of India to visit Tirupati district on 20th and 21st: SP L. Subbaraidu
ఎఎస్ఎల్ లో భాగంగా ముందస్తు భద్రత ఏర్పాట్లపై సమీక్షించిన కలెక్టర్, ఎస్పీ
భారత రాష్ట్రపతి పర్యటనలో చిన్నపాటి లోపాలకు కూడా తావు ఉండరాదు
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రోటోకాల్ విధులు నిర్వహించాలి:
జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్
పక్కాగా బందోబస్తు నిర్వహణ:
ఎస్పి ఎల్.సుబ్బరాయుడు
తిరుపతి,
నవంబర్ 20, 21వ తేదీలలోరాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుపతి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా రానున్నారని, ప్రముఖుల పర్యటనలో చిన్నపాటి లోపాలకు కూడా తావివ్వరాదని ముందస్తు భద్రతా శ్రేణి లైజన్ (ఎ.ఎస్.ఎల్ ) లో భాగంగా అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు.
సోమవారం ఉదయం రేణిగుంట ఎయిర్పోర్ట్ నందు ఏర్పాటు చేసిన ముందస్తు భద్రత లైజన్ అధికారుల సమన్వయ సమావేశంలో కలెక్టర్ ఎస్పి తో కలసి సమీక్షించారు.
రాష్ట్రపతి తిరుమల తిరుపతి పర్యటనలో భాగంగా ఈ నెల నవంబర్ 20 న మధ్యాహ్నం 3.25 గం.లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గాన బయలుదేరి 3.55 గం.లకు తిరుచానూరుకు చేరుకొని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు. అమ్మవారి దర్శనం అనంతరం 4.30 గం.లకు బయలుదేరి 5.20 గం.లకు తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహానికి చేరుకుని రాత్రికి బస చేయనున్నారని తెలిపారు. మరుసటి రోజు 21వ తేదీ ఉదయం 9.30 గంటలకు శ్రీ వరాహ స్వామిని దర్శించుకుని, అనంతరం 10.00 గం.లకు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారన్నారు. శ్రీవారి దర్శనానంతరం తిరిగి శ్రీ పద్మావతి అతిధి చేరుకుని, ఉదయం 10.50 గంటలకు తిరుమల నుండి బయలుదేరి ఉదయం 11.50 గంటలకు తిరుపతి విమాశ్రయం చేరుకొని 12.00 గంటలకు హైదరాబాద్ తిరుగు ప్రయాణం కానున్నారని తెలిపారు.
సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ వారు స్పెషలిస్ట్ డాక్టర్లు ఏర్పాటు, సేఫ్ రూమ్ ఏర్పాటు, అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్, సంబందిత బ్లడ్ గ్రూప్, కావాల్సిన మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అగ్నిమాపక శాఖ ఫైర్ ఇంజన్ లను ఏర్పాటు చేసి అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఫుడ్ సేఫ్టీ వారు ప్రముఖులకు అందించే ఆహారాన్ని నిబందనల మేరకు పరీక్షించాలన్నారు. ఏపీ ఎస్పీడీసీఎల్ విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని అన్నారు. మున్సిపల్ మరియు పంచాయితీ శాఖ అధికారులు శానిటేషన్ ఏర్పాట్లు చేపట్టాలని, ఆర్ అండ్ బి అధికారులు ప్రముఖులు పర్యటించే రహదారులు బాగుండేలా చూసుకోవాలన్నారు. కాన్వాయ్ వెహికల్స్ కు ఉపయోగించే వాహనాలను స్థితిగతులను పరిశీలించి మంచి కండీషన్లో ఉన్న వాహనాలు ఏర్పాటు చేయాలన్నారు. డి.ఎస్.ఓ. ప్రముఖులకు భోజన ఏర్పాట్లు, త్రాగు నీరు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎయిర్ పోర్ట్ నందు విఐపి లాంజ్ నందు తగిన సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఎయిర్పోర్ట్ వారిని ఆదేశించారు. ప్రోటోకాల్ అంశాలు తదితర విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ తరపున బందోబస్తు పక్కాగా ఉండాలని, ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండరాదని, ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పోలీస్ అధికారులకు విధులు నిర్వహించాలని, విధులు యందు నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని తెలుపుతూ దిశా నిర్దేశం చేశారు.
అనంతరం రాష్ట్రపతి పర్యటించనున్న తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి దేవాలయం, తిరుమల శ్రీ పద్మావతి అతిధి గృహం, వరాహస్వామి దేవాలయం, తిరుమల శ్రీవారి ఆలయం, మరియు తిరుమల రాంభగీచ పరిసర ప్రాంతాలను టిటిడి అడిషనల్ ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి, టిటిడి, విజిలెన్స్ మరియు సంబందిత అధికారులతో కలసి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్.పి లు పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘు వాన్షి, అడిషనల్ ఎస్.పి. లు రవి మనోహరాచారి, శ్రీనివాస రావు, నాగభూషణ రావు, వెంకటరాముడు, తిరుపతి, శ్రీకాళహస్తి, ఆర్.డి.ఓ. లు రాం మోహన్, భాను ప్రకాష్ రెడ్డి, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ భూమినాథన్, సి.ఐ.ఎస్.ఎఫ్ అధికారి అనురాగ్ యాదవ్, వి.ఎస్.ఓ. టిటిడి గిరిధర్, ఐబి అధికారి శిరీషా, డి.ఎస్.పి. లు రామ కృష్ణా చారి, చంద్ర శేఖర్, భక్తవత్సలం, రామ కృష్ణ, చిరంజీవి, ప్రసాద్, రాంబాబు, అంకారావు, వెంకట నారాయణ, డి.ఎఫ్.ఓ రమణయ్య, ఆర్.టి.ఓ మురళి మోహన్, డి.ఎం.హెచ్.ఓ బాల కృష్ణ నాయక్, ఆర్ అండ్ బి ఎస్.ఈ రాజా నాయక్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగ మల్లేశ్వర్ రావు, డి.పి.ఓ. శుశీలా దేవి, డి.ఐ.పి.ఆర్.ఓ గురుస్వామి చెట్టి, రేణిగుంట, తిరుపతి తహశీల్దార్లు చంద్ర శేఖర్, సురేష్ బాబు, ఇన్స్పెక్టర్ లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.


