మహిళలకు చీరలు ఇస్తే వారు “కోటీశ్వరులు” ఎట్లా అవుతారు..
* చీరలు ఇస్తే మహిళల ఉన్నతి ఎట్లా జరుగుతుంది?
* సారె అంటే రేవంత్ రెడ్డి కి అర్థం తెలుసా? సారె ఎవరు ఎవరికి, ఏ సందర్భంలో ఇస్తారు?
* సారె రూపంలో ఆడబిడ్డల తెలంగాణ సాంప్రదాయాన్ని అవమానించొద్దు
* కేవలం ఎన్నికల వేళ చీరలు ఇచ్చి మోసం చేయాలనుకోవడం దుర్మార్గం
* చీరలు పంపిణీ చేస్తున్న ఉద్దేశ్యం రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం మాత్రమే
* బిజెపి తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి
హైదరాబాద్ నవంబర్ 20
How can women become “millionaires” if they are given sarees?
;నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కానీ కోటి మంది మహిళలకు చీరలు ఇస్తే వారు “కోటీశ్వరులు” ఎట్లా అవుతారో మహిళలందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చీరల పంపిణీ ద్వారా మహిళల ఉన్నతి, తెలంగాణ ప్రగతి జరుగుతుందని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. చీరలు ఇస్తే మహిళల ఉన్నతి ఎట్లా జరుగుతుంది? దాని ద్వారా తెలంగాణ ప్రగతి ఎట్లా జరుగుతుంది? అనేది రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి డిమాండ్ చేసారు. గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయం లో మీడియా సమావ్వేశం లో మాట్లాడుతూ సారె రూపంలో చీరలు పెట్టాలని ఒక ఆలోచన వచ్చింది – అది మంచిదే.కానీ… సారె అంటే రేవంత్ రెడ్డి కి అర్థం తెలుసా? సారె ఎవరు ఎవరికి, ఏ సందర్భంలో ఇస్తారు అనేది రేవంత్ రెడ్డికి తెలుసా?సారె అంటే — బియ్యం నుంచి బంగారం వరకూ, పుట్టింటి వాళ్లు ఆడపిల్లలకు ఇచ్చే ఒక ఆభరణం. దాన్ని మీరు ఏ సందర్భంలో ఇస్తున్నారు? అనేది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి.రేవంత్ రెడ్డికి నిజంగా మీ బానిసత్వ స్వభావాన్ని నిరూపించుకోవాలని అనిపిస్తే — ఇందిరాగాంధీ జయంతి నుంచి సోనియా గాంధీ జయంతి (డిసెంబర్ 9) వరకు 21 రోజులు జపమాల వేసుకోండి. వారికి పొర్లుదండాలు పెట్టండి. కానీ సారె రూపంలో ఆడబిడ్డల తెలంగాణ సాంప్రదాయాన్ని అవమానించొద్దు.ఈ రాష్ట్రంలో కోటి 68 లక్షల మహిళలు ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం కోటి చీరలు మాత్రమే పంచుతానంటోంది. మిగతా 68 లక్షల మహిళలు ఎందుకు కనిపించడం లేదు..?సారె పెట్టాలంటే దానికి ఒక సందర్భం ఉంటుంది. మరి ఇప్పుడు ఏ పండగ ఉంది?కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత — రెండు దసరాలు, రెండుసార్లు దీపావళి, రెండు ఉగాదులు.. ఇలా పండుగలు వచ్చాయి. అప్పుడు గుర్తుకురాని మహిళలు.. ఇప్పుడు అకస్మాత్తుగా ఏ సందర్భంలో గుర్తొచ్చారు? ఇప్పుడు సడెన్‌గా వారి మీద ప్రేమ కురిపించి చీరలు పెట్టడం వెనుక అర్థం ఏంటి?అదికాక — ఈ చీరల పంపిణీని విడతల వారీగా చేస్తున్నారు. మొదటి విడత — డిసెంబర్ 9 వరకురెండో విడత — మార్చిలో. మొదటి విడతలో 65 లక్షల చీరలు గ్రామీణ మహిళలకు, రెండో విడతలో 35 లక్షల చీరలు అర్బన్ మహిళలకు. ఎందుకు?ఎందుకంటే డిసెంబర్ 15న గ్రామ పంచాయతీ ఎలక్షన్ల నోటిఫికేషన్ విడుదల చేస్తారు.తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్. అందుకే — మహిళలను మోసం చేయడానికి, మహిళ ఓటు బ్యాంక్ కోసం కొత్త డ్రామా తెరపైకి తెచ్చారు.రేవంత్ రెడ్డి కొత్తగా నేర్చుకున్నది ఏమిటంటే — పక్క రాష్ట్రాల ఎలక్షన్ ఫలితాలు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ — ఎక్కడైతే మోదీ “లఘ్ పతి దీదీ” వంటి స్కీమ్స్ వల్ల మహిళలకు ప్రయోజనం జరిగిందో అక్కడ మహిళల ఓటు బ్యాంకు ఎలా పెరిగిందో చూసి… “తమకెందుకు ఇదే ఆలోచన రావద్దు?” అని అనుకున్నారు.మహిళలు..భవిష్యత్తు


