ఘనంగా వాదాన్య సంస్థ 15వ వార్షికోత్సవ వేడుకలు..
The 15th anniversary of the musical organization was celebrated with great pomp.
శేరిలింగంపల్లి, నవంబర్ 30 (వాయిస్ టుడే): ఉభయ తెలుగు రాష్ట్రాలలో నిరుపేద మరియు ప్రతిభావంతులైన విద్యార్థులకు విద్యా అవకాశాలను అందిస్తూ గడచిన 15 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాదాన్య సంస్థ తమ 15వ వార్షికోత్సవాన్ని గచ్చిబౌలిలోని ఈఎస్‌ఐసీ (ESIC) ఆడిటోరియంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు, సమాజానికి వదాన్య సంస్థ అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ న్యాయమూర్తి జి. రామకృష్ణ ప్రసాద్, పబ్లిక్ పాలసీల నిపుణులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ (ఐఏఎస్), పీసీసీఎఫ్ & హెచ్ఓఎఫ్‌ఎఫ్ డాక్టర్ సి. సువర్ణ, ఐఐఎస్‌సీ ప్రొఫెసర్ గాలి మాధవి లత, తెలుగు సినిమా దర్శకుడు హను రాఘవపూడి మరియు సినీ రచయిత వి.వి.ఎస్. రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లలు ప్రదర్శించిన సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. వర్సికోత్సవం సందర్భంగా వాదాన్య జనా సొసైటీ ఫౌండర్ అశోక్ మాట్లాడుతూ ఆర్థిక అసమానతలు విద్యకు అడ్డంకిగా మారకూడదనే లక్ష్యంతో వాదాన్య సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ప్రతిభావంతులైన కానీ ఆర్థికంగాను వెనుకబడిన విద్యార్థులకు ఇంటర్మీడియట్ నుండి ప్రొఫెషనల్ కోర్సులు వరకు సహాయం చేయడం, చదువు పూర్తయ్యాక ప్రతిభ పరీక్షలు ద్వారా ఎంపికై విద్యార్థులకు వారు కోరుకున్న రంగాలలో కోచింగ్ అందించి ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడేలా చేయడం వంటివి పలు సేవా కార్యక్రమాలు సంస్థ అందిస్తుందన్నారు. 2010లో ప్రారంభించిన ఈ సంస్థ ప్రయాణంలో ప్రతి విద్యార్థికి చదువులో తమ వంతు సహకారం అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు.”ప్రతిదీ డబ్బుతో ముడిపడదు,” అని పేర్కొంటూనే విద్యార్థుల భవితవ్యాన్ని తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కనీసం 0.5 శాతం కాంట్రిబ్యూషన్ అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 2018లో మొదటి సారి విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించామన్నారు. 2020లో (కరోనా సమయం) అవకాశం ఉన్న ప్రతి చోట ఆక్సిజన్ సిలిండర్లను సమకూర్చారన్నారు. 2021లో పిల్లల కోసం ప్రత్యేకంగా పోటీ పరీక్షలు నిర్వహించామన్నారు. నేడు 100 మందికి పైగా పిల్లలు మంచి స్థానాల్లో స్థిరపడి,తిరిగి సంస్థకు సహకరిస్తున్నారన్నారు. ప్రస్తుతం 400 మంది వాలంటీర్లతో ఇప్పటివరకు 15,000 మంది విద్యార్థులకు టాలెంట్ పరీక్షలు నిర్వహించినట్లు అశోక్ వెల్లడించారు. గ్రామీణ (రూరల్) ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు సహకారం అందించడమే తమ భవిష్యత్తు లక్ష్యమని అశోక్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఒక విద్యార్థిని దత్తత (అడాప్ట్) తీసుకుని వారికి సంబంధించిన అన్ని సౌకర్యాలను చూసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.



