యాదాద్రిలో నూతన అన్నప్రసాద భవనం ప్రారంభం
వాయిస్ టుడే/యాదగిరిగుట్ట
New Annaprasada building inaugurated in Yadadri

యాదగిరిగుట్ట పుణ్యక్షేత్ర మైన లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సన్నిధిలో కొండ కింద అన్నప్రసాద భవనాన్ని ఆదివారం ఆలయ ఈవో వెంకట్రావు భవనధాత అనంతకోటి రాజ్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన భవనం అందుబాటులోకి రావడంతో సంతోషంగా ఉందని ప్రతినిత్యం సుమారు 2000 భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని ప్రారంభించారు. ఈ భవనం అందుబాటులోకి రావడంతో యాదగిరిగుట్ట వచ్చే భక్తులందరికీ స్వామివారి అన్న ప్రసాదాన్ని అందించే దిశగా యాదాద్రి దేవస్థానం ముందుకు వెళ్తుందని అన్నారు. డోనర్ అనంత కోటి రాజుని ఈవో అభినందించారు. అన్న ప్రసాదంలో టెంపుల్ సిబ్బంది. అందరూ పాల్గొన్నారు.


