Sunday, January 25, 2026

 రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రధానమంత్రి కి ఆహ్వాన పత్రిక అందజేసిన రేవంత్ రెడ్డి.

- Advertisement -

 రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రధానమంత్రి కి ఆహ్వాన పత్రిక
అందజేసిన తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి.

Revanth Reddy presents invitation to Prime Minister for Rising Global Summit.
తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 8, 9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనాల్సిందిగా ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారు.
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో కలిసి ఢిల్లీ పార్లమెంట్ భవన్‌ ప్రధానమంత్రి  కార్యాలయంలో  మోదీ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించి ప్రత్యేకంగా ముద్రించిన ఆహ్వాన పత్రికను అందజేశారు.  కేంద్ర ప్రభుత్వ నిర్దేశిత వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా, తనవంతుగా తెలంగాణ దేశ ఆర్థిక ప్రగతిలో తోడ్పాటును అందించాలన్న సంకల్పంతో తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక పత్రం రూపొందించినట్టు ముఖ్యమంత్రి  వివరించారు. వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోవడంలో 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలని సమగ్రమైన ప్రణాళికలతో రోడ్ మ్యాప్‌ను రూపొందించినట్టు చెప్పారు.
వివిధ రంగాల్లో నిష్ణాతులు, నిపుణులు, నీతి ఆయోగ్ సలహా సూచనలను క్రోడీకరించి మేధోమథనం అనంతరం విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించినట్టు చెప్పారు.
తెలంగాణ రైజింగ్ లక్ష్యాలకు అనుగుణంగా ఫలితాలు సాధించడంలో, అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం తగిన సహాయ సహాకారాలు అందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ని కోరారు.హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని కోరారు. మొత్తం 162.5 కిలోమీటర్ల పొడవునా విస్తరించే ప్రతిపాదనలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిందని,  రూ.43,848 వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా  చేపట్టేందుకు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి కేబినేట్ ఆమోదంతో పాటు ఆర్థిక పరమైన అనుమతులు, అలాగే  దక్షిణ భాగం నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు.
రీజనల్ రింగ్ రోడ్డు వెంట ప్రతిపాదనల్లో ఉన్న రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టును వీలైనంత తొందరగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.  హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం పోర్ట్ వరకు 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, హైదరాబాద్ నుంచి బెంగుళూరు హై స్పీడ్ కారిడార్‌ను అభివృద్ధి చేసేందుకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం చేపట్టేలా కేంద్రం ప్రత్యేక చోరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి నిరంతరాయంగా రవాణా సదుపాయం ఉండేలా టైగర్ రిజర్వ్ మీదుగా మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు నాలుగు వరుసల ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనలను ఆమోదించాలని కోరుతూ వినతిపత్రం అందించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్