Sunday, February 22, 2026

ఇందిరమ్మ క్యాంటీన్ ను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

- Advertisement -

నిరుపేదల ఆకలి తీర్చడమే ప్రజా ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం.

Corporator Ragam Nagender Yadav inaugurated Indiramma Canteen

ఇందిరమ్మ క్యాంటీన్ ను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ .

శేరిలింగంపల్లి, డిసెంబర్ 5 (వాయిస్ టుడే): నిరుపేదల ఆకలి తీర్చడమే ప్రజా ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శుక్రవారం ఉదయం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల రైతు బజార్ వద్ద ఇందిరమ్మ క్యాంటీన్ ను శేరిలింగంపల్లి జోనల్ కమీషనర్ హేమంత్ భోర్కడే, డిప్యూటీ కమీషనర్ ప్రశాంతితో కలిసి నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదల అభ్యున్నతికి చేయూతనిస్తూ హైదరాబాద్ నగరంలో ఉపాధి కోసం ఇతర పనుల నిమిత్తం వచ్చే వారి సౌకర్యార్థం ఉదయం అల్పాహారం మధ్యాహ్నం సమయంలో భోజనం చేయడానికి ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేశారన్నారు. ఈ క్యాంటీన్లను నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం మార్కెట్ అభివృద్ధి పనులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏఎంహెచ్ఓ శ్రీకాంత్ రెడ్డి, జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం ఈఈ శిరీష, డిఈ ఆనంద్, ఏఈ భాస్కర్, నల్లగండ్ల వెజిటేబుల్ మార్కెట్ ప్రెసిడెంట్ డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, కే రాంచందర్, మార్కెట్ వైస్ ప్రెసిడెంట్ ఖాజా పాషా, శ్రీనివాస్, వార్డ్ మెంబర్ కవిత గోపికృష్ణ, గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, ఆంజనేయులు, కృష్ణ యాదవ్, అజీమ్, మొయిస్, దాదు, చిన్న, శ్రీనివాస్ రెడ్డి, రాజు, వినయ్ తదితర జిహెచ్ఎంసీ సంభందిత సిబ్బంది, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్