Sunday, January 25, 2026

తగ్గేదేలే అంటున్న బంగారం వెండి ధరలు…

- Advertisement -

తగ్గేదేలే అంటున్న బంగారం వెండి ధరలు…

సామాన్యులకు అందని పుత్తడి.
Gold and silver prices are said to be falling…

కమాన్ పూర్

వెండి, బంగారం ధరలు మళ్లీ జోరందుకున్నాయి. వెండి ధరల గురించి చెప్పనక్కరలేదు.. తారాస్థాయిలో రేటు పలుకుతోంది.  కిలో వెండి ధర ఏకంగా రూ.5 వేలకు పెరిగి ఆల్ టైమ్ రికార్డు రూ.2,31,000 కు చేరింది. వెండి దూకుడు చూస్తుంటే వచ్చే ఏడాది జనవరిలోనే రూ.2,50,000 వేలు పలికినా ఆశ్చర్యపడనక్కరలేదు అంటున్నారు నిపుణులు.  అలాగే రానున్న రోజుల్లో బంగారం కొనాలి అంటే సామాన్య మానవుడు కొనే పరిస్థితి నెలకొనలేదు. ఫిబ్రవరిలో పెళ్లిళ్లు ఉండడంతో సామాన్య మానవులు ధరలను చూసి లబోదిబో , వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. 1,40,400కు చేరుకుంది. కేవలం గంటల వ్యవధిలోనే బంగారం ధరలు దూకుడు మీదున్నాయి. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర కూడా రూ. వేల ధరమేర పెరిగి రూ.1,31,000కు చేరుకుంది. కొన్ని రోజులుగా అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్న వెండి ధర గురువారం  కూడా అదే ట్రెండ్ను కొనసాగిస్తోంది. ఏకంగా రూ. 5 వేల మేర పెరిగి రూ.2,19,000కు చేరుకుంది. అంతర్జాతీయంగా కూడా పసిడి, వెండి ధరలు చుక్కలను అంటాయి. 24 క్యారెట్ల ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 4,383 డాలర్లను తాకింది. అక్టోబర్లో నమోదైన జీవితకాల గరిష్ఠం కంటే 1.5 శాతం మేర పెరిగింది. ఔన్స్ వెండి ధర కూడా 3.4 శాతం మేర పెరిగి 70
డాలర్లకు చేరువైంది.  ఫెడ్ రేట్లో కోతపై పెరిగిన అంచనాలతో బంగారం, వెండి ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయని నిపుణులు చెబుతున్నారు.  . ఇదే డిసెంబర్ 24వ తేదీన వెండి కిలో ధర రూ.2,10,000ఉండటం గమనార్హం. పసిడి కూడా ఏమాత్రం తగ్గకుండా పరుగు లంకించుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,100 పెరిగి రూ.1,40,400కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1000 పెరిగి రూ.1,30,000లకు చేరింది. పసిడి ధరలు కూడా మరింత పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. బంగారం ధర ఇలాగే ఉంటే సామాన్యులు మాత్రం బంగారం దిక్కు చూడకుండా రోల్డ్ గోల్డ్ వేసుకునే పరిస్థితి నెలకొంది అని సామాన్యులు తెలుపుతున్నారు. రానున్న ఫిబ్రవరి పెళ్లిళ్ల సీజన్లో బంగారం ధర ఎంతవరకు పరుగెడుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్