ఏపీలో తగ్గిన క్రైం రేటు
సాంకేతక పరిజ్ఞానంతో మరింత తగ్గిస్తాం
డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
అమరావతి
Crime rate has decreased in AP: DGP Harish Kumar Gupta
గత యేడాదితో పోలిస్తే. ఈయేడాది ఏపీలో క్రైం రేటు బాగా తగ్గింది. మహిళలకు రక్షణ, మత్తు పదార్ధాల రవాణా, సెల్ పోన్లు రికవరీ వంటి అనేక వాటిలో మంచి పురోగతి సాధించామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. రాష్ట్ర పోలీసు శాఖ వార్షిక నివేదికను అయన విడుదల చేసారు.
డీజీపీ మాట్లాడుతూ నిరంతరం సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ నేరాలను మరింత తగ్గించేలా నూతన యేడాదిలో పోలీసులు పని చేస్తారు . వచ్చే పదేళ్లల్లో పోలీసింగ్ ఎలా ఉంటుదనే దానిపై వర్కుషాపు నిర్వహిస్తున్నాం. పోలీసు విధుల్లో వచ్చిన మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం, ఎలా అందిపుచ్చుకోవాలో వివరిస్తాం. సంక్రాంతి పండుగ తర్వాత ఈ వర్కుషాపు ఉంటుంది. ఇటీవల కీలక కేసులను కూడా ప్రస్తావిస్తూ.. ఎలా చేధించారో వివరిస్తాం. సరికొత్త పోలీసింగ్ కనిపించేలా ఈ వర్కుషాపు ద్వారా అందరికీ తెలియచేస్తామని అన్నారు.
అప్పా ఒక్కటే మనకు పెండింగ్ లో ఉంది.. దానిపై త్వరలోనే ప్రకటన వస్తుంది. చట్టానికి అందరూ సమానమే.. వ్యతిరేకంగా వెళ్లేవారిపై చర్యలు ఉంటాయి. ఇందులో విజయం, అపజయం ఉండదు.. చట్టాన్ని చేతులోకి తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవమే మా విధి. సేఫ్ ఏరియా అనుకుని కొంతమంది నక్సలైట్లు ఏపీలోకి వచ్చారు. కానీ ఎప్పటికప్పుడు మేము నిఘా ఉంచి.. వారందరినీ పట్టుకున్నాం. సైబర్ నేరాలకు సంబంధించి చైనాలో పెద్ద గ్యాంగ్స్ ఉన్నాయి. మోసం జరిగిన వెంటనే ఆదేశానికి నగదు వెళ్లిపోతుంది. అందుకే ఇటువంటి కేసులలో నగదు వాపస్ అనేది చాలా కష్టమైన పని. ఇటువంటి మోసాల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. కేంద్రం ఇచ్చిన నివేదిక ప్రకారం 36వస్థానంలో ఏపీ ఉందనే వార్తలు వాస్తవం కాదు. అది పాత సిస్టమ్.. మన డేటాకు, వారి డేటాకు మధ్య ఉన్న తేడా వల్ల అలా వచ్చింది. అప్పుడు వారి డ్యాష్ బోర్డులో తప్పు ఉందని మేము వారికి లేఖ రాశాం. ఇప్పుడు చూడండి.. డ్యాష్ బోర్డులో మన ఏపీ ఎక్కడ ఉందో తెలుస్తుంది. మహిళలకు రక్షణ , గంజాయి రవాణ, నేరాల నియంత్రకు మేము ప్రాధాన్యత ఇస్తున్నాం. అక్కడక్కడా మహిళల వేధింపులు కేసులు నమోదు అవుతుంటాయి. ఆలయాల వద్దకు లక్షల్లో వెళ్లే భక్తుల్లో ఎక్కడో వేధింపు ఘటన ఉంటుందని అన్నారు.
అన్నీ జనరలైజ్ చేసి చూడకూడదు.. కానీ మేము ఎప్పుడూ మహిళలకు రక్షణగానే ఉంటామని స్పష్టం చేసారు.


