Sunday, January 25, 2026

సల్మాన్ ఖాన్ 60వ పుట్టినరోజు వేడుకకు హాజరైన రామ్ చరణ్

- Advertisement -

సల్మాన్ ఖాన్ 60వ పుట్టినరోజు వేడుకకు హాజరైన రామ్ చరణ్

Ram Charan attended Salman Khan’s 60th birthday party

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ 60వ పుట్టినరోజు వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు. స్టార్‌లతో నిండిన ఈ వేడుకకు రామ్ చరణ్ హాజరుకావడం ఈవెంట్ ని మరింత స్పెషల్ గా మార్చింది.
రామ్ చరణ్ సింపుల్, క్లాసీ లుక్‌లో అదరగొట్టారు. సాఫ్ట్ కలర్స్‌తో కూడిన క్లిన్ అవుట్‌ఫిట్‌లో నేచురల్ స్టైల్‌తో అలరించారు. ఆయన స్టైల్, స్వాగ్ హైలైట్‌గా నిలిచాయి.ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రామ్ చరణ్, సల్మాన్ ఖాన్, ఎంఎస్ ధోనీ, బాబీ డియోల్ కలిసి దిగిన ఫోటో. సినిమా, క్రికెట్ ప్రపంచాలకు చెందిన దిగ్గజాలు ఒకే ఫ్రేమ్‌లో సహజంగా నవ్వుతూ కనిపించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యింది.
రామ్ చరణ్ – సల్మాన్ ఖాన్‌ల మధ్య ఉన్న స్నేహబంధం ఈ వేడుకలో స్పష్టంగా కనిపించింది. ఇది కేవలం వృత్తిపరమైన పరిచయమే కాదు, అంతకంటే లోతైన అనుబంధమని ఈ మూమెంట్స్ చాటి చెప్పాయి. మెగా ఫ్యామిలీతో సల్మాన్‌కు ఉన్న సన్నిహిత సంబంధం, చరణ్ ప్రజెన్స్ ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చింది.
రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రేక్షకులు, అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది.
తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్